కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో..

కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో.. కొత్త 2022 ఆడి ఏ4 ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లను పొందింది. వీటిలో టాంగో రెడ్ మరియు మ్యాన్‌హాటన్ గ్రే కలర్ ఆప్షన్లు. ఇందులో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ల విషయానికి వస్తే, ఆడి ఏ4 టెక్నాలజీ వేరియంట్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు 19 స్పీకర్లతో కూడిన బి అండ్ ఓ (B&O) ప్రీమియం సౌండ్ సిస్టమ్ ను పొందుతుంది. ఆడి గతేడాది జనవరి నెలలో తమ 2021 ఏ4 సెడాన్‌ను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు వచ్చిన కొత్త 2022 ఏ4 సెడాన్ కూడా అలానే ఉంటుంది. దీని డిజైన్ మరియు ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

 కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో..

ఆడి ఏ4 సెడాన్‌లో లభించే ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ లగ్జరీ కారులో ఆడి వర్చువల్ కాక్‌పిట్ డిస్‌ప్లే, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ గ్లాస్ సన్‌రూఫ్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్ మరియు ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో.. ఆడి ఏ4 లగ్జరీ సెడాన్ శక్తివంతమైన 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్ ను మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని చక్రాలకు పంపిణీ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది మరియు గరిష్టంగా గంటకు 241 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది.

కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో.. ఆడి ఇండియా లైనప్‌లో ఎంట్రీ-లెవల్ లగ్జరీ సెడాన్ అయిన ఏ4 ముందు భాగంలో పెద్ద హెక్సాగోనల్ గ్రిల్‌, ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, సిగ్నేచర్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు ఎల్ఈడి టెయిల్‌లైట్లను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్ మరియు ఆటో-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌లు, సైడ్స్ లో కొత్తగా రూపొందించిన 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ మరియు కారు చుట్టూ క్రోమ్ సరౌండిగ్స్‌తో ఇది చాలా ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. ఆడి ఏ4 మంచి రోడ్ ప్రజెన్స్ తో తప్పకుండా చూపరుల దృష్టిని ఆక్టటుకుంటుంది.

కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో.. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా అనుమతిస్తుంది. ఇంకా ఇందులో స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రేమ్‌లెస్ మరియు యాంటీ-గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో.. సేఫ్టీ విషయానికి వస్తే, ఆడి ఏ4 సెడాన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. అవి – ఎఫిషియన్సీ, కంఫర్ట్, డైనమిక్ మరియు ఇండివిడ్యువల్. డ్రైవర్ ఎంచుకునే డ్రైవింగ్ మోడ్ ను బట్టి థ్రోటల్ రెస్పాన్స్ మరియు స్టీరింగ్ వెయిట్ మారుతూ ఉంటాయి.

కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో.. కొత్త 2022 ఆడి ఏ4 సెడాన్ ఈ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్‌ఈ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఆడి ఏ4 సెడాన్ యొక్క వేరియంట్ల వారీగా ధరలు ఇలా ఉన్నాయి:

  • ఆడి ఏ4 ప్రీమియం – రూ.43.12 లక్షలు

  • ఆడి ఏ4 ప్రీమియం ప్లస్ – రూ.47.27 లక్షలు

  • ఆడి ఏ4 టెక్నాలజీ – రూ.50.99 లక్షలు

    (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).