కృష్ణ వ్రింద విహారికి సెన్సార్ క్లియరెన్స్, రేపే విడుదల

ఈ వారం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల్లో నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో శౌర్య మరోసారి హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడని అర్ధమవుతూనే ఉంది. మరోవైపు ఎండా వానా అని లెక్క చేయకుండా సినిమా కోసం పాదయాత్రలు, ప్రచారాలు అంటూ శౌర్య చాలానే కష్టపడుతున్నాడు. ఇక అబ్బాయి శ్రమకు తగ్గట్లు ఈరోజే సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ లభించింది. దీంతో రేపు థియేటర్లలో అబ్బాయి రప్ఫాడించేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇటీవలే విజయవంతంగా పాదయాత్ర ముగించుకున్న నాగశౌర్య ఎక్కడికక్కడ అభిమానులతో మమేకం అవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. యాత్రకు అభిమానులు బ్రహ్మరథం పట్టిన వైనం చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తూనే ఉంది. దీంతో చిత్ర బృందం కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోందనే చెప్పాలి. మరోవైపు ట్రేడ్ వర్గాలు కూడా సినిమా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయనే చెప్పాలి.

ఐరా క్రియేషన్స్ పతాకం పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షెర్లీ సేటియా హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక శౌర్య తల్లిగా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. రాథిక పాత్ర మునుపెన్నడూ చూడనంత ప్రత్యేకంగా ఉంటుందని ఇటీవలే ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ చిత్ర బృందం తెలిపింది. ఇక ట్రైలర్ లో శౌర్య సూపర్ ఇన్నోసెంట్ కుర్రాడిలా కనిపించబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే. టైటిల్ కు తగ్గట్లు మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది.

సినిమాలో వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తమదైన స్టైల్ లో అలరించబోతున్నారని అర్ధమవుతోంది. మహతి స్వరసాగర్ అందించిన స్వరాలు కూడా ఆహ్లాదంగా ఉండటంతో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. మరి మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కృష్ణ వ్రింద విహారి’ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగించి, కలెక్షన్లకు ఊపిరులూదుతాడేమో చూడాలి.