కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్..

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. వాహనాలను తయారు చేసే కంపెనీలు కార్లలో ఉపయోగించే సోయా ఆధారిత వైర్ కవరింగ్‌లు (వైర్లను కప్పి ఉంచే ప్లాస్టిక్ స్లీవ్‌లు) ఎక్కువగా ఎలుకలను ఆకర్షిస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇది కొంత వరకూ నిజమే అయినప్పటికీ, వైర్ కవరింగ్‌లతో సంబంధం లేకుండా, ఎలుకలు వెచ్చదనం మరియు ఆశ్రయాన్ని వెతికే పనిలో భాగంగా కారు బానెట్ క్రిందికి ప్రవేశిస్తుంటాయి. ఇంజన్ కంపార్ట్‌మెంట్ యొక్క వెచ్చదనం కారణంగా అవి ఇలా చేస్తాయి. క్రింద తెలిపిన చిట్కాలను పాటిచడం ద్వారా కార్లలో ఎలుకల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

  కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్..

వీలైనంత వరకూ మీ కారును గ్యారేజ్‌లోనే పార్క్ చేయండి

ఎక్కువగా కార్లను బయట పార్క్ చేసినప్పుడే ఇలాంటి సమస్యలు ఎదరవుతుంటాయి. ప్రత్యేకించి మీరు పార్క్ ప్రదేశంలో డ్రైనేజీలు ఉన్నా లేదా ఏవైనా కిరాణా సరుకులు దుకాణాలు లేదా ఆహార ధాన్యాల గోడౌన్లు ఉన్నా ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆరుబయట కారును పార్కింగ్ చేయడంటే, ఎలుక చేతికి తాళం చెవి ఇచ్చినట్లే. కాబట్టి, వీలైనంత వరకూ మీ కారును కవర్డ్ పార్కింగ్‌లో లేదా మీ ఇంటిలో కార్ గ్యారేజీ ఉంటే అందులో మాత్రమే పార్క్ చేయండి. మీ కారులో తరచూ ఇలాంటి సమస్య ఉన్నట్లయితే కాస్తంత ఖర్చయినా పర్వాలేదు, మీ కారు కోసం మంచి కవర్డ్ పార్కింగ్ లేదా పెయిడ్ పార్కింగ్ లను వెతుక్కోవడం మంచిది.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. కారు విండోస్ మరియు సన్‌రూఫ్‌లను పూర్తిగా మూసేయండి

చాలా మందికి కారు పార్క్ చేసిన తర్వాత సైడ్ విండోస్ గ్లాస్ డోర్లను కొద్దిగా తెరచి ఉంచడం అలవాటు. ఇలా చేయడం వలన కారు లోపల వేడి గాలి, దుర్వాసన బయటకు పోతుందనేది వారి అభిప్రాయం. ఇది నిజమే అయినప్పటికీ, ఇలా చేయడం వలన మీరు మీ కారులోకి ఎలుకలు ప్రవేశించడం కోసం రెడ్ కార్పెట్ వేసినట్లే అవుతుంది. మీ కారును పార్క్ చేసిన తర్వాత తప్పనిసరిగా అన్ని విండోస్ మరియు సన్‌రూఫ్‌లను పూర్తిగా మూసివేయండి. ఇలా చేయడం వలన ఎలుకలు కారు క్యాబిన్ లోపలకు ప్రవేశించే మార్గం ఉండదు.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. కారులో ఆహార పదార్థాలు పడేయకండి, క్యాబిన్‌ను శుభ్రంగా ఉంచుకోండి

కారు లోపల క్యాబిన్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వలన మీకు కారు లోపలికి ప్రవేశించిన ప్రతిసారి ఉల్లాసంగా అనిపించడమే కాకుండా, ఎలుకల సమస్యకు కూడా నివారణ దక్కుతుంది. చాలా మంది కార్లలో ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. ప్రత్యేకించి, పిల్లలు ఎక్కువగా ఉండే కార్లలో క్యాబిన్ ఫ్లోర్ పై ఆహార పదార్థాలు పడుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే, మీరు కారులో ఎలుకలను డిన్నర్ కోసం ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే, కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలను కూడా నిల్వ చేయకపోవడం చాలా మంచి అలవాటు అని గుర్తుంచుకోండి.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. క్యాబిన్‌లో పెప్పర్‌మింట్ ఆయిల్ వంటి పెర్ఫ్యూమ్ లను ఉపయోగించండి

ఎలుకలకు మంచి సువాసన అంటే ఇష్టం ఉండదు. క్యాబిన్‌లో ఎంత దుర్వాసన వస్తే కారులో ఎలుకలు దాని అంతగా ఆస్వాదిస్తాయి. కాబట్టి, మీ కారులో ఎల్లప్పుడూ మంచి సువాసన వచ్చే ఎయిర్ ఫ్రెషనర్‌లు లేదా కార్ పెర్ఫ్యూమ్ లను ఉపయోగించండి. పెప్పర్‌మింట్ ఆయిల్ ఎలుకలకు నచ్చిన ఓ అద్భుతమైన కార్ పెర్ఫ్యూమ్. ఇది మనకు పెప్పర్‌మెంట్ వాసనను అందిస్తూనే, ఎలుకలు పారిపోవడానికి కూడా సహాయపడుతుంది. ఇవే కాకుండా లవంగాలు, మిరియాల నుండి వచ్చే ఆయిల్స్ కూడా ఎలుకలను దూరంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇలాంటి నూనెలో కాటన్ బాల్స్‌ను నానబెట్టి, వాటిని మీ కారు క్యాబిన్‌లో లేదా హుడ్ కింద ఉంచవచ్చు.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. పార్క్ చేసిన కారు చుట్టూ ఫినాయిల్ లేదా రంపపు పొట్టు చల్లండి

మీ కారులో ఎలుకల సమస్య ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, కారు పార్క్ చేసిన తర్వాత దాని చుట్టూ ఫినాయిల్ లేదా రంపపు పొట్టును చల్లుకోవచ్చు. సాధారణంగా, ఎలుకలకు ఫినాయిల్ వంటి కెమికల్స్ వాసన పడదు. అలాగే, కొయ్య మిల్లుల వద్ద ఉండే పచ్చి రంపపు పొట్టు కూడా ఎలుకలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. కారు చుట్టూ ఫినాయిల్స్ చల్లడం వలన మీ కారు సమీపంలోకి ఈగలు, చిమ్మటలు, బొద్దింకలు మరియు విషపూరిత పాములను కూడా రాకుండా చూసుకోవచ్చు.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. మీ కారులోని వైర్లను రోడెంట్-డిటరెంట్ టేప్‌తో చుట్టండి

కారు లోపల ఎలుకలు కలిగించే ప్రధాన నష్టం, కారులోని వైరింగ్ వ్యవస్థను డ్యామేజ్ చేయడమే. ప్రస్తుతం, మార్కెట్లో ఈ వైర్లను కవర్ చేయడం రోడెంట్-డిటరెంట్ టేప్‌ అందుబాటులో ఉంటుంది. హోండా క్యాప్సైసిన్‌తో ట్రీట్ చేయబడిన ఎలుకల-నిరోధక టేప్‌ను తయారు చేస్తుంది. ఇది హాట్ పెప్పర్స్‌లో కనిపించే ఓ రకమైన పదార్ధం మరియు ఇది ఎలుకలకు రుచించని పదార్థం. ఈ టేప్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మీ కారులోని వైర్లను ఈ టేప్ తో చుట్టడం ద్వారా ఎలుకల సమస్యకు చెక్ పెట్టవచ్చు.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. సౌండ్ రిపెల్లెంట్ పరికరాలను ఉపయోగించండి

మార్కెట్లో అనేక రకాల సౌండ్ రిపెల్లెంట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్స్ కేవలం ఈగలు, దోమలు వంటి వాటినే కాకుండా ఎలుకలను కూడా దూరంగా ఉంచుతాయి. ఇవి ఎలుకలకు మాత్రమే వినిపించే కొన్ని నానో శబ్ధాలను చేస్తాయి. ఈ ధ్వని తరంగాలు మానవులకు వినబడవు మరియు కుక్కలు లేదా పిల్లులను కూడా ఇబ్బంది పెట్టవు. ఈ పరికరాలు తక్కువ పరిధిని కలిగి ఉంటాయి, కాబట్టి మీరు వాటిని మీ కారుకు దగ్గరగా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. ఎలుక బోనులు లేదా రోడెంట్ ట్రాప్స్ ను ఉపయోగించండి

ఇది కొంచెం హింసతో కూడుకున్న పనే, కానీ మీరు మీ కారును రక్షించుకోవాలంటే ఇలా చేయక తప్పదు. ఎలుకలను పట్టడం మార్కెట్లో అనేక రకాల బోన్లు, ట్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ కారు చుట్టు పక్కల లేదా క్యాబిన్ లోపల సెట్ చేయడం ద్వారా ఎలుకలను ట్రాప్ చేయవచ్చు. ఇలా ట్రాప్ చేసిన వాటిని దూరంగా తీసుకెళ్లి వదిలేయవచ్చు.

కారులో ఎలుకల కీస్ కీస్.. ఎలక్ట్రికల్ వైర్లన్నీ పీస్ పీస్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పదు మీకు పెద్ద లాస్.. కార్లలో ఎలుకలు కలిగించే ప్రమాదాలు ఏంటి?

కార్లలో ఎలుకల వల్ల కలిగే నష్టం చాలా ఖరీదైనది మరియు కొన్ని మరమ్మతులను మీ కారు ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయలేదు. అలాగే, కొన్ని ఎనిమల్ డ్యామేజెస్ మీ కారు వారంటీ పరిధిలోకి కూడా రావు. కాబట్టి, అలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ జేబులను ఖాలీ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, మీకు ఎలుకలు అంటే అలెర్జీ ఉన్నట్లయితే, అవి క్యాబిన్‌లో లేదా హుడ్ క్రింది భాగంలో చేసే హడావిడి కారణంగా మీరు జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.