ఆ మొబైల్ కొనే డబ్బుతో ఈ బైకులే కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 (Suzuki Gixxer SF 250):

దేశీయ మార్కెట్లో సుజుకి మోటార్సైకిల్ యొక్క ‘సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250’ రూ. 1,92,100 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ ధర దాదాపు ఐఫోన్ 14 ధరకు చాలా దగ్గరగా ఉంది. కావున ఈ డబ్బుకు సులభంగా సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది మంచి పనితీరుని అందించే బైక్. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్పోర్టీ సీట్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్టీ ఎగ్జాస్ట్ వంటివి ఉన్నాయి.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ దాని విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, కెటిఎమ్ RC 250, బజాజ్ డామినార్ 250 మరియు యమహా FZ 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4.0 (Yamaha YZF-R15 V4.0):

అత్యంత ప్రజాదరణ పొందిన యమహా కంపెనీ యొక్క వైజెడ్ఎఫ్-ఆర్15 వి4.0 కూడా ఐఫోన్ 14 కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1,78,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ మంచి స్పోర్టి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటి వాటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి Yamaha YZF-R15 బైక్ 155 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలిగి స్లిప్పర్ క్లచ్ మరియు జపనీస్ టెక్నాలజీతో వస్తుంది. ఇది కెటిఎమ్ RC 125 మరియు కెటిఎమ్ RC 200 అంటి వాటితో పాటు బజాజ్ పల్సర్ RS200, జావా 42 మరియు సుజుకి జిక్సర్ 250 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్‌ (Hero Xpulse 200 4V Rally Edition):

హీరో మోటోకార్ప్ యొక్క ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్‌ ధర రూ. 1,52,100 (ఎక్స్-షోరూమ్). కావున ఇది కూడా ఐఫోన్ 14 కంటే కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ బైక్ ఈ మధ్య కాలంలోనే దేశీయ మార్కెట్లో విడుదలై మంచి బుకింగ్స్ పొందుతూ ముందుకు సాగుతోంది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్‌ మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంలో ఇందులో 199.6 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, 4-స్ట్రోక్, 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్‌ దేశీయ మార్కెట్లో హోండా సిబి200ఎక్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మరియు కెటిఎమ్ డ్యూక్ 250 అడ్వెంచర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి కెటిఎమ్ 200 డ్యూక్ (KTM 200 Duke):

భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ధర వద్ద లభించే బైకుల్లో కెటిఎమ్ బ్రాండ్ యొక్క 200 డ్యూక్ కూడా ఒకటి. దీని ధర 1,91,693 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ యొక్క అప్డేటెడ్ మోడల్ గత సంవత్సరంలోనే విడుదలయింది. ఇది యువ కొనుగోలుదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి కెటిఎమ్ డ్యూక్ బైక్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకూండా మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా హార్నెట్ 2.0, టీవీఎస్ అపాచే RTR 200 4వి మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350):

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యొక్క ఇటీవల విడుదలైన కొత్త హంటర్ 350 కూడా మన జాబితాలో ఐఫోన్ 14 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. హంటర్ 350 ధర రూ. 1,49,900 (ఎక్స్-షోరూమ్). ఇదిరాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇతర 350సీసీ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే అదే J-సిరీస్ ప్లాట్‌ఫామ్ పై తయారు చేయబడింది.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి (రేంజ్) 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.

ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఐఫోన్ 14 ధర వద్ద మరియు దానికంటే తక్కువ ధరకే లభించే బైకులు గురించి తెలుసుకున్నాము. ఇంతకు ముందు ఐఫోన్ 14 ధర వద్ద లభించే కార్లను గురించి కూడా తెలుసుకున్నాము. కాబట్టి ఐఫోన్ 14 బదులుగా కార్లు మరియు బైకులు కొనుగోలు చేయాలనేవారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. దీనిపైనా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త బైకులు & కార్లను గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.