Puri Jagannath: అడ్డా మారుస్తున్న పూరి జగన్నాథ్ ? లైగర్ ఫ్లాప్ తో ఆ సిటీకి మకాం..!

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగాడు పూరి జగన్నాథ్. మాస్, డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ గా యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. హీరోను ఎలివేట్ చేసే ఆయన విధానానికి యావత్ తెలుగు ఇండస్ట్రీ ఫిదా అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిజంతోపాటు కథానాయకుడిలో కొద్దిపాటి నెగెటివ్ షేడ్స్ చూపించి సరికొత్త పంథాకు పురుడు పోశాడు జగన్. ఇక ఆయన రాసే డైలాగ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గన్ నుంచి వచ్చే బుల్లెట్లా ఉంటాయి జగన్ మాటలు. అయితే గత కొద్దికాలంగా వరుసగా ఆయన సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో కొత్త ప్లేస్ కు మారే ఆలోచనలో ఉన్నాడట పూరి జగన్నాథ్.

స్టార్ డైరెక్టర్ గా పేరొందిన పూరి జగన్నాథ్.. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చాడు. అప్పటివరకు క్లాస్ హీరోలుగా పేరొందిన కథాయనాయకులకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చాడు. విభిన్నమైన డైలాగ్ లతో ఆద్యంతం అదరగొట్టే పూరి జగన్నాథ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నుడుస్తోందనే చెప్పవచ్చు.

ఎందుకంటే గత కొద్ది కాలంగా పూరి తెరకెక్కించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవట్లేదు. అలాగే ప్రేక్షకుల నోటి నుంచి నెగెటివ్ టాక్ వస్తోంది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడనుకున్న పూరి జగన్నాథ్ లైగర్ మూవీతో ఎక్కడికో వెనక్కి వెళ్లిపోయాడని టాక్ వినిపిస్తోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడి కట్టిన లైగర్ మూవీకి ఎలాంటి టాక్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతోపాటు చిత్రంపై విమర్శల వర్షమే కురిసింది. లైగర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండతో తరకెక్కిస్తున్న జనగణమన మూవీపై క్లారిటీ లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కథల కోసం బ్యాంకాక్ వెళ్తారన్న విషయం తెలిసిందే. అయితే లైగర్ సినిమా కోసం తన బేస్ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేశాడు పూరి జగన్నాథ్. అంతేకాకుండా అక్కడే సెటిల్ అవుదామని ప్లాన్ కూడా చేశాడట. అయితే లైగర్ మూవీ నిరాశపరచడంతో ముంబైలో తీసుకున్న అద్దె ఫ్లాట్ ఖాళీ చేశాడని సమాచారం.

నెలకు రూ. 15 లక్షలు ఉన్న ఆ ఫ్లాట్ ను ఖాళీ చేయడమే ఉత్తమంగా భావించారట ఛార్మీ అండ్ టీమ్. అయితే తాజాగా పూరి జగన్నాథ్ తన బేస్ ను గోవాకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు కథల కోసం బ్యాంకాక్ వెళ్లే పూరి తాజాగా గోవాలో కథలు డిజైన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

గోవాలో ఒక మంచి బీచ్ ఫేస్ ఉన్న రెండు బిల్డింగ్స్ ఖరారు చేశారని, అందులో ఒక దానిలో పూరి జగన్నాథ్ దిగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. లైగర్ మూవీతో పూరి జగన్నాథ్ తో సినిమాలు చేసేందుకు హీరోలు సిద్ధంగా లేరని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మళ్లీ ఫామ్ లోకి రావాలని తన ప్లేస్ ను పూరి జగన్నాథ్ మార్చినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ, బ్లాక్ బస్టర్ కథ, టేకింగ్ తో అప్పటి పూరి జగన్నాథ్ ను మళ్లీ చూడాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆశిస్తున్నారు.