Janaki Kalaganaledu September 20th: అఖిల్ తో మల్లిక నాటకం.. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేలా మరో ట్విస్ట్!

జానకి కలగనలేదు ఊహించని ట్విస్ట్ లతో జనాల్లో మంచి ఆదరణను పెంచుకుంటోంది. ఇక రామచంద్ర సహకారంతోనే అతని భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు.

ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 392 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

రామచంద్ర చిన్న తమ్ముడు అఖిల్ జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత ఆమెకు గర్భం వచ్చేలా చేసి ఇప్పుడు మాత్రం తనకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు అంటూ అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అయితే ఆ విషయంలో రామచంద్ర భార్య జానకి, అఖిల్ మీద తీవ్ర కోపంతో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జెస్సికి అన్యాయం జరగకూడదనే అఖిల్ పెళ్లి జరిపించాలి అనుకుంటుంది.

అయితే అఖిల్ మాత్రం తన తల్లికి భయపడి తన ప్రేమ విషయాన్ని దాస్తాడు. ఎవరు ఎంత అడిగినా కూడా అసలు నిజాన్ని చెప్పడు. అంతేకాకుండా జానకి అన్నయ్య ఇద్దరు కూడా నన్ను అనుమానిస్తున్నారు అని ఎవరో అమ్మాయి కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని సూసైడ్ నాటకం కూడా ఆడతాడు.

అయితే అఖిల్ చేత నిజం ఎలా చెప్పించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో జానకి బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది అని అంటుంది. డీఎన్ఏ పరీక్ష లో అఖిల్ జెస్సి గర్భవతి కావడానికి కారణం అనేది రుజువు అవుతుంది అని కూడా జానకి చెబుతోంది.

అయితే ముందుగానే ఆ విషయం తెలుసుకున్న మల్లిక ఈ విషయంలో జానకిని ఇబ్బంది పెట్టాలి అని ఇంట్లో గొడవలు సృష్టించాలి అని అనుకుంటుంది. అందుకే అఖిల్ చేత ఆమె ముందుగానే మాట్లాడి నువ్వు చనిపోతాను అంటూ బెదిరించు మీ అమ్మ నిన్ను తప్పకుండా నమ్ముతుంది అని సలహాలు ఇస్తుంది.

ఇక అఖిల్ మల్లిక చెప్పినట్లుగానే సూసైడ్ నాటకం తో ఒక్కసారిగా ఇంట్లో అందరినీ మార్చేస్తాడు. తల్లి జ్ఞానంబ కూడా కొడుకు చనిపోవడానికి సిద్ధం అయ్యాడు అంటే తప్పు చేయకపోయి ఉండవచ్చు అని నమ్ముతుంది. అంతేకాకుండా జానకి ఇచ్చిన ఐదు అవకాశాలలో ఒక తప్పు చేసింది అని మరో 4 తప్పులు చేస్తే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని జ్ఞానంబ హెచ్చరిస్తుంది.

ఇక తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. రామ కూడా అఖిల్ తప్పు చేయలేదని అంటాడు. జానకి మాత్రం అఖిల్ తప్పు చేశాడు కాబట్టే ఈ విధంగా నాటకం ఆడారని చనిపోవాలి అనుకుంటే మీరు తలుపులు బద్దలు కొట్టే వరకు కూడా అతను మాటలతోనే సమయాన్ని వృధా చేశాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే తప్పకుండా నిజం బయట పడుతుంది అని అఖిల్ భయపడ్డాడు అని అందుకే నాటకం ఆడాడు అని జానకి అంటుంది.

ఇక మరోవైపు మల్లికా అఖిల్ నిజంగానే తప్పు చేసాడు అని తెలుసుకుంటుంది. అందుకే జెస్సి తల్లిదండ్రులను ఇంటికి వచ్చేలా చేయాలి అని ఇక్కడ గొడవ సృష్టించాలని కూడా అనుకుంటుంది. జెస్సి ఇంటికి ఫోన్ చేసిన మల్లికా జానకి రామ చంద్ర ఇద్దరు కలిసి మిమ్మల్ని మోసం చేశారు అని నాలుగు రోజులు ఓపిక పడితే సమస్యలు సర్దుకుంటాయని అని చెప్పిన మాటలు అన్నీ కూడా అబద్ధమే అని మల్లిక లేనిపోని విషయాలను ఎక్కించి చెబుతుంది.

దీంతో జెస్సి తల్లిదండ్రులు మల్లిక ఎవరో అనే విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆమె చెప్పింది కూడా నిజమేనని ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని వెంటనే జ్ఞానంబ ఇంటికి వెళ్లి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అనుకుంటారు.

ఇంట్లో అందరూ కూడా ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక మల్లిక మరొకవైపు ఇంకా జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు రాలేదు ఏంటి అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే జెస్సి తల్లిదండ్రుల ఇంట్లోకి వస్తారు. మేము బాధపడుతూ ఉంటే ఇక్కడ మీరు సంతోషంగా ఉన్నారా అని మీ అఖిల్ వల్ల నా కూతురు గర్భవతి అయింది అని పెళ్లి చేస్తారా లేదా అంటూ డైరెక్ట్ గా అడుగుతారు.

అయితే అందుకు జ్ఞానంబ మాత్రం నా కొడుకు తప్పు చేయలేదు అని గట్టిగా సమాధానం ఇస్తుంది. ఇక ఆఖరి సారి అడుగుతున్నాను అంటూ జెస్సి తల్లి దండ్రులు సీరియస్ గా చెప్పారు. మరి ఈ విషయంలో జ్ఞానంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.