ICICI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు బాదుడు స్టార్ట్.. ఐసీఐసీఐ కొత్త ఛార్జీ.. ఎప్పటి నుంచి అంటే..

         For Quick Alerts  

Subscribe Now          

  

For Quick Alerts  

ALLOW NOTIFICATIONS          

bredcrumb

bredcrumb

     |                                                                                     Published: Tuesday, September 20, 2022, 15:16 [IST]                                     

ICICI Credit Card: దేశంలోని దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ సంచల నిర్ణయం తీసుకుంది. తాజాగా తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై భారాన్ని మోపనుంది. దేశంలో ఇలాంటి ఛార్జీలను వసూలు చేస్తున్న మెుదటి బ్యాంకింగ్ సంస్థగా ఐసీఐసీఐ నిలిచింది. అసలు విషయం ఏమిటంటే..

 అక్టోబర్ నుంచి..   

అక్టోబర్ నుంచి..

అక్టోబర్ 20, 2022 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటి అద్దె చెల్లించే వారికి ఐసీఐసీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. అటువంటి లావాదేవీలపై 1% ఛార్జీ విధించబడుతుందని కస్టమర్లకు తెలిపింది. దీంతో కస్టమర్లకు ఇకపై అదనపు భారం పడనుందని తెలుస్తోంది. ఛార్జ్ ఎవరు చెల్లించాలి..?

ఛార్జ్ ఎవరు చెల్లించాలి..?

రెడ్ జిరాఫీ, MyGet, Paytm, Magicbricks వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇంటి అద్దె చెల్లించడానికి తమ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కార్డ్ హోల్డర్‌లకు కొత్తగా తెస్తున్న ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి చెల్లింపులపై ఇప్పటి వరకు ఇతర బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి ఛార్జీలను విధించటం లేదు. అయితే రానున్న రోజుల్లో ఇతర సంస్థలు సైతం ఇలాంటి చెల్లింపులపై ఐసీఐసీఐ మాదిరిగానే రుసుము విధిస్తాయని తెలుస్తోంది. మీరు ఇప్పటివరకు చెల్లించినది

మీరు ఇప్పటివరకు చెల్లించినది

అద్దెదారు ప్లాట్‌ఫారమ్‌లో యజమాని బ్యాంక్ ఖాతా వివరాలను లేదా UPI చిరునామాను జోడించి.. క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీని పూర్తి చేస్తారు. ఇటువంటి సేవలను అందిస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి లావాదేవీపై 0.46-2.36% కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఈ రుసుము MDR (ట్రేడింగ్ డిస్కౌంట్ రేట్)కి ప్రత్యామ్నాయంగా వసూలు చేయబడుతుంది. ఈ క్రమంలో ICICI బ్యాంక్ వసూలు చేసే 1% రుసుము ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విధించబడే లావాదేవీల ఛార్జీలకు అదనంగా ఉండనుంది. దీంతో కార్డు వినియోగదారులకు భారం పెరగనుందని తెలుస్తోంది. నిపుణులు ఏమంటున్నారు..?

నిపుణులు ఏమంటున్నారు..?

రెడ్ జిరాఫీ మినహా ఈ సదుపాయాన్ని అందించే అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు లావాదేవీ వాస్తవికతను ధృవీకరించాల్సిన అవసరం ఉన్నందున, క్రెడిట్ కార్డ్ సౌకర్యం ద్వారా అద్దె చెల్లింపును సులభంగా దుర్వినియోగం చేయవచ్చని పరిశ్రమ నిపుణులు సూచించారు. ఢిల్లీ యూనివర్శిటీలోని హన్స్‌రాజ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాషిఫ్ అన్సారీ మాట్లాడుతూ.. బోగస్ అద్దె చెల్లింపు ద్వారా క్రెడిట్ రొటేషన్‌ను నిరోధించడానికి ఈ రుసుము ప్రవేశపెట్టబడిందని అన్నారు. English summary

icici announces imposing 1 percent charge over rent payments through credit cards know details

icici announces imposing 1 percent charge over rent payments through credit cards know details

Story first published: Tuesday, September 20, 2022, 15:16 [IST]