Bigg Boss Telugu 6: నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. ఆమెపై శ్రీహన్, రేవంత్ ఆగ్రహం!

బిగ్ బాస్ మూడో వరం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే సరికొత్త టాస్క్ ను మొదలుపెట్టారు. దొంగ పోలీస్ అనే ఈ ఆటలో ఒక అడవిలో దొంగతనాలు చేయాల్సి ఉంటుంది. అలాగే మరొక వ్యాపారవేత్తగా గీతుని సెలెక్ట్ చేశారు. ఈ టాస్క్ లో భాగంగా కొంతమంది పోలీసులుగా కొంతమంది దొంగలుగాను వ్యవహరిస్తారు. అని బిగ్ బాస్ చెప్పాడు. ఆట స్టార్ట్ అవ్వగానే ఎవరికి వారు పోటీ పడుతూ దూకుడుగా కనిపించారు. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో వివరాల్లోకి వెళితే..

ఇక ఈ గేమ్ లో అత్యాశ ఉన్న వ్యాపారవేత్తగా గీతుని సెలెక్ట్ చేశారు. ఇక ఆట మొదలవగానే అందరూ కూడా చాలా బలంగా పోటీపడ్డారు. ముఖ్యంగా ఇనయా మరోసారి తన గొంతును గట్టిగానే వినిపించింది. ఇక ఆర్జే సూర్య ఆమెతో వాదించాడు. మేము బయటకు వచ్చేలోపు రావాలి అంటూ ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. మరోవైపు దొంగలు హౌస్ లో వివిధ రకాల వస్తువులను దొంగతనం చేస్తూ ఎవరికి తెలియని ప్రదేశాల్లో దాచేస్తూ ఉంటారు.

ఈ తరుణంలో పోలీసులు వాళ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అత్యాశ ఉన్న వ్యాపారవేత్తగా ఉన్న గీతూ మధ్యలో మాట్లాడుతూ ఉండడంతో నువ్వు చేసేది దొంగ వ్యాపారం మళ్లీ పోలీసులతో మాట్లాడుతున్నవా అంటూ ఆదిరెడ్డి కామెంట్ చేశాడు. ఇక తర్వాత గీతూ అయితే నాతో మాట్లాడాలి అంటే రూల్ చూపించి మాట్లాడాలి అని చెప్పింది. ఇక దొంగ పోలీసులు వారి డ్యూటీలు కొనసాగించే క్రమంలో తోపులాట గట్టిగానే జరిగింది.

లైన్ దాటుతున్నారు అంటూ దొంగలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శ్రీహాన్ అయితే గట్టిగా అరుస్తూ వాడు ఎక్కడి నుంచి లాగాడు అంటూ ఇనయాపై అరిచేసాడు. అయితే ఈ ఆటలో ఈనయా వాడు వీడు అనడంతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అంటూ ఒక్కసారిగా శ్రీహన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే మధ్యలో వచ్చిన రేవంత్ కూడా అదే తరహాలో ఇనయా పై కోపాన్ని చూపించాడు.

మొన్న కూడా వాడు అన్నావు అంటూ అప్పుడే లాగి ఒక్కటి ఇవ్వాల్సింది అంటూ రేవంత్ మరింత దూకుడుగా ప్రవర్తించాడు. ఇక ఇనయా తగ్గకుండా కొడతాను అని ఎలా అంటావు అని ప్రశ్నించింది. ఇక తర్వాత రేవంత్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ ఇంట్లో ఏమి నేర్పలేదా అంటూ వాడు అని ఎలా ఉంటావు అని గట్టిగా మరింతగా అరిచేశాడు. మరి వీరి మధ్య దొంగ పోలీస్ ఆట ఇంకా ఇలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.

Bigg Boss house lo Donga 🥷 Police 👮 game… The race for captaincy is on! 💥

Don’t miss today’s episode of Bigg Boss on StarMaa, streaming 24/7 on DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/T7Zycf5gY9

ఇక ఈ వారం నామినేషన్ లో మొత్తం పదిమంది ఉన్నారు. ఆదిత్య ఆరోహి, గీతూ, ఇనయా, నేహా అలాగే రేవంత్ శ్రీహన్, సుదీప, వాసంతి.. ఈ ఇక వీరిలో హౌస్ లో నుంచి ఎవరు వెళ్లిపోతారు అనే విషయంలోనే అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అసలైతే గతంలోనే ఇనయా సుల్తానా వెళ్లిపోవడం ఖాయమని అనుకున్నారు. ఇక ఈసారి ఆమెపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఆమె హౌస్ లో చాలా బలంగా పోరాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ నామినేషన్స్ లో ఎవరు హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోతారో చూడాలి.