Bigg Boss Telugu 6: గీతూకు క్లాస్ పీకిన సుదీప, చంటితో మాటల యుద్ధం.. నామినేషన్లలో అరుపులు, గొడవలు, బూతులు

ఇక బిగ్ బాస్ హౌజ్ లో అసలైన రచ్చ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్ సభ్యులందరూ మొన్నటి వరకు సిల్లీ కారణాలతో నామినేట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ మూడో వారం నామినేషన్స్ మాత్రం కారణాల సంగతి ఎలా ఉన్నా అరుపులు, బూతులతో వాడివేడిగా కొనసాగింది. బిగ్ బాస్ సీజన్ ఆరో సీజన్ లో మూడో వారం నామినేషన్స్ లో రంగు పూసి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పగా సభ్యులందరూ అలానే చేశారు. ఈ వారం నామినేషన్లలో మొత్తంగా 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ఆరో సీజన్ లో మూడో వారం నుంచి అసలైన అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం నామినేషన్లు అన్న విషయం తెలిసిందే. ఈ మూడో వారం నామినేషన్లు రచ్చ రచ్చగా మారి హౌజ్ లో హీట్ పుట్టించాయి. సోమవారం జరిగిన నామినేషన్లలో భాగంగా ఆదిరెడ్డి తన ఎక్స్ ప్రెషన్స్, మాట్లాడే తీరు డిఫరెంట్ గా ఉంది. ఇనయా రెహ్మాన్ ను నామినేట్ చేస్తూ రంగు పూసాడు ఆది రెడ్డి.

ఈ క్రమంలో ఇనయతో గొడవకు దిగాడు ఆది రెడ్డి. మీరు గేమ్ బాగా తెలుసుకుని వచ్చి ఆడుతున్నారు అని ఇనయ అనగానే ఆదిరెడ్డికి కోపం కట్టలు తెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రంగు ఉన్న పళ్లాన్ని ఎత్తేస్తా బిగ్ బాస్ అంటూ అరవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇనయ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆదిరెడ్డితో వాగ్వాదానికి దిగింది.

ఇక మరోవైపు చిత్తూరు చిరుత గీతూ రాయల్ కు సుదీపకు కొద్దిపాటి వార్ జరిగింది. నామినేషన్ లో భాగంగా సుదీపను గీతూ రాయల్ నామినేట్ చేసింది. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అని మీరు ఇంతకుముందు చెప్పారు. కానీ మీరు అది పాటించలేదు. మొన్న ఎమోషనల్ అవుతూ మీరు కన్నీళ్లు తుడుచుకుని ఆ టిష్యూలను అక్కడే పడేశారు. అయితే ఆ మరుసటి రోజు కూడా మీరు ఆ టిష్యూలను తీయలేదు.

అందుకే నామినేట్ చేస్తున్నాని గీతూ చెప్పగా సుదీప గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దేనికైన ఒక స్పాట్ ఉంటుంది. అది ఈరోజు నువ్ టచ్ చేశావు. ఒక సిల్లీ రీజన్ కు నన్ను నామినేట్ చేయడం చూస్తుంటే నీ బుద్ధి ఎక్కడ ఉందో అర్థమవుతుంది అంటూ సుదీప తెలిపింది. తర్వాత చంటిని నామినేట్ చేసింది గీతూ రాయల్.

చంటి, గీతూ రాయల్ మధ్య ఒక మాటల యుద్ధమే జరిగింది. నువ్వా? నేనా? వాదించుకున్నారు గీతూ రాయల్, చంటి. బయట ఒకలా, హౌజ్ లో ఇంకోలా అన్ రియల్ గా ఉంటున్నారన్న కారణంతో చంటిని నామినేట్ చేసింది గీతూ రాయల్. తర్వాత చంటి వచ్చి గీతూ రాయల్ ను నామినేట్ చేశాడు. పదిమందిలో కలిసి ఉంటున్నప్పుడు సంస్కారంతో ఉండాలని గీతూతో అన్నాడు చంటి.

దానికి గీతూ ముందు మీకు సంస్కారం ఉందో లేదో చూసుకోండి అంటూ గొడవ పెట్టుకుంది. చంటి, గీతూ రాయల్ ఏమాత్రం తగ్గకుండా పరస్పరం వాదించుకున్నారు. ఆర్గ్యుమెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గేమ్.. కానీ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ గేమ్ అని చంటి బదులిచ్చాడు. దీంతో అందరితో గొడవ పెట్టుకోవడం తనకు ఏం తీట లేదంటూ గీతూ బదులిచ్చింది.

ఇలానే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇలా సోమవారం మొత్తంగా గీతూ రాయల్, బాలాదిత్య, చంటి, వాసంతి, ఆరోహి, నేహా చౌదరి, ఇనయ రెహ్మాన్, శ్రీహాన్, సింగర్ రేవంత్ 9 మంది నామినేషన్లలో నిలిచారు.