పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే?

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? MG మోటార్ కంపెనీ ఆస్టర్ SUV ధరలను ఇప్పటికే గతంలో రెండు సార్లు పెంచింది. అయితే ఇప్పుడు మరోసారి రూ. 10,000 వరకు ధరలను పెంచింది. ధరల పెరుగుదల తరువాత ఎంట్రీ లెవల్ ‘స్టైల్’ 1.5-లీటర్ మాన్యువల్ గేర్‌బాక్స్ ధర రూ. 10.32 లక్షల (ఎక్స్-షోరూమ్). అయితే టాప్ ఎండ్ టాప్ ట్రిమ్ శావి 1.3 లీటర్ టర్బో ఆటోమేటిక్ ధర రూ. 18.23 లక్షలు (ఎక్స్-షోరూమ్).

 పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే?

ఎంజి ఆస్టర్ మొత్తం స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావి అనే ఐదు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ సంవత్సరం జూన్ నెలలో కూడా తన ఆస్టర్ ధరలను వేరియంట్స్ ని బట్టి రూ.30,000 నుంచి రూ. 40,000 వరకు పెంచింది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? MG Astor ఎస్‌యూవీ మొత్తం రెండు ఇంజన్ ఆప్షన్‌ లతో అందుబాటులో ఉంది. అవి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 140 బిహెచ్‌పి పవర్ మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ SUV ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్, దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి. అంతే కాకుండా బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? MG ఆస్టర్ సైడ్ ప్రొఫైల్ లో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు, అంతే కాకుండా.. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇది మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆస్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో అందుబాటులో ఉన్న బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. ఇది పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ సహాయంతో కారులో ఇవ్వబడుతుంది. కావున ఇది మీ ఆదేశాలను వింటుంది. అంతే కాకుండా దీని ద్వారా మ్యూజిక్ ప్లే చేయవచ్చు, ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు. దీనికోసం పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత ‘దీపా మాలిక్’ వాయిస్ ఉపయోగించబడింది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? ఈ కొత్త SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్‌ ఉంటుంది. కావున ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది. దీని కోసం ఈ-సిమ్ మరియు లాట్ టెక్నాలజీ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం రోబోట్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది వాహనదారుల ఆదేశాలను పాటిస్తుంది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? MG Astor సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

పండుగ సీజన్‌లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే? డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో పండుగ సీజన్ లో కంపెనీ తన ఆస్టర్ ధరలను పెంచడం వల్ల, అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందా.. లేదా, అనేది తెలియరావాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.