ఇద్దరిలో ఒకరికీ పదవీ: గెహ్లట్‌కు ఇండైరెక్టుగా గాంధీ ఫ్యామిలీ సపోర్ట్..శశిథరూర్ మాత్రం

కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు అశోక్ గెహ్లట్ కాగా మరొకరు సీనియర్ నేత శశిథరూర్. వీరిలో ఒకరికీ కాంగ్రెస్ చీఫ్ పదవీ వరించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 22 ఏళ్ల తర్వాత అధ్యక్ష పదవీకి..గాంధీయేతర వ్యక్తి ఎన్నిక జరగనుంది. మొన్నటి వరకు గెహ్లట్ పేరు వినిపించగా.. థరూర్ అభ్యర్థత్వాన్ని కూడా సోనియా గాంధీ అంగీకారం తెలిపారు. అయితే ఎన్నికల్లో ఎవరికీ గాంధీ కుటుంబం సపోర్ట్ చేయదని తెలుస్తోంది.

అయితే ఇప్పటికీ చాలా మంది రాహుల్ గాంధీ అద్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. దీనిని బలపరిచేందుకు పలు రాష్ట్రాలు తీర్మానాలు కూడా చేశాయి. కానీ రాహుల్ గాంధీ ఈ విషయమై స్పందించలేదు. దీంతో థరూర్, గెహ్లట్ మధ్యే పోటీ ఉండనుంది. అయితే గెహ్లట్‌కు గాంధీ కుటుంబం వెన్నుదన్నుగా నిలువనుంది. కానీ అధి అనధికారమే. గెహ్లట్ గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. సచిన్ పైలట్ బీజేపీతో సంప్రదింపులు జరిపినా.. రాష్ట్రంలో పార్టీ పదవీ దూరం కాకుండా రాహుల్ కాపాడారు.

అధ్యక్ష పదవీకి గెహ్లట్ ఈ నెల చివరి వారంలో నామినేషనన్ వేస్తారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలని ఆయన అంటున్నారు. నిన్న సాయంత్రం సోనియాతో శశి థరూర్ భేటీ అయ్యారు. అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరగనుంది. సోనియా గాంధీ ఎవరి పేర్లను ముందుకు తీసుకురాబోదని.. తటస్థంగా ఉంటారని తెలిపారు. ఎన్నిక మాత్రం స్వేచ్చయుతంగా నిర్వహిస్తారని.. అందుకే సోనియాను కలిసానని వివరించారు.