అద్భుతమైన కారు కొనుగోలు చేసిన

     Bredcrumb

Updated: Tuesday, September 20, 2022, 9:16 [IST]  

సినీ పరిశ్రమలో కేవలం హీరోలకు మాత్రమే హీరోయిన్లకు (కథానాయకి) కూడా కార్లంటే చాలా ఇష్టం. కావున ఇప్పటికే చాలామంది హీరోలతో పాటు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ మలయాళీ నటి 'అపర్ణ బాలమురళి' ఇటీవల ఒక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది.

Recommended Video

భారత్‌లో 2022 Mercedes-Benz C-Class లాంచ్: ధర & వివరాలు

ఇంతకీ అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కారు ఏది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

    అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా?  నటి అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎమ్‌జి జిఎల్ఏ 35' (AMG GLA 35). దీనికి సంబందించిన ఫోటోలను కూడా నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన చాలామంది అభిమానులు కొత్త కారు కొనుగోలు చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా?

అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన కొత్త Mercedes Benz AMG GLA 35 ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.40 లక్షలు. ఇది అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ కారుని ఇంతకుముందు విదేశీ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకునే వారు. అయితే ఇప్పుడు కంపెనీ భారత్‌లో తన ప్రధాన కార్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కావున కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా? కొత్త Mercedes Benz AMG GLA 35 కారులో అప్‌గ్రేడ్ చేయబడిన గ్రిల్ డిజైన్, రీడిజైన్ చేయబడిన బంపర్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్, అగ్రెసివ్ ట్విన్ ఎగ్జాస్ట్, ఆకర్షణీయమైన AMG బ్యాడ్జ్ వంటి అనేక అప్‌గ్రేడ్ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ కారుని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా? Mercedes-Benz GLA 35 కారులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ ఉంటాయి. ఇందులోని 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ 161 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. అదే సమయంలో ఇది కేవలం 8.7 సెకన్లలో 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా? ఇక 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 189 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఇది 7.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా? ఇక చివరగా 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 304 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది. Mercedes-Benz GLA 35 ఆధునిక భద్రతా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా? అపర్ణ బాలమురళి భారతదేశానికి చెందిన ప్రముఖ గాయని మరియు నటి కూడా. ఈమె తమిళ నటుడు సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం ద్వారా స్టార్‌గా పేరుతెచ్చుకుని ఆ సినిమాలోని అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఆ తరువాత మహేశ్ఇంతే ప్రతీకారం మరియు యాత్ర తుదరున్ను వంటి మలయాళీ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా? నటి అపర్ణ బాలమురళి కేవలం మలయాళీ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటించింది. ఇది మలయాళీ సినిమా అయిన సూరరై పోట్రు సినిమాకి తెలుగు అనువాదం.

          English summary

National award winner actress aparna balamurali buys mercedes benz amg gla 35