అత్తమామలను నగ్న వీడియోలు తీసిన కోడలు.. ప్రియుడితో కలిసి భర్తకు బెదిరింపులు..

తల్లిదండ్రుల లాగా చూసుకోవాల్సిన అత్తమామపై ఓ కోడలు దారుణానికి ఒడిగట్టింది. వారి నగ్న వీడియోలు తీసింది. అత్తమామల బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలను అమర్చి అభ్యంతరకరమైన వీడియోలు తీసింది ఆ కోడలు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికితన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.

వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త గుర్తించాడు. ఈ విషయమై భార్యను నిలదీశాడు. విషయం తెలిసిపోవడంతో ఇంట్లో ఉన్న రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పరారైంది. వెంటనే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భర్తకు ఫోన్‌ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తమామల నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరించింది. తనపై కేసును వెనక్కి తీసుకోకపోతే.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ భయపెట్టింది. ఈ మేరకు లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి కుటుంబం లక్ష్మీ నగర్ ప్రాంతంలో నివసిస్తుండగా, చాందినీ చౌక్ ప్రాంతంలో బంగారు,
వజ్రాల దుకాణం ఉంది.

అతనికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెప్టెంబరు 5న భార్య మొబైల్‌లో స్నేహితుడి నుంచి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని భర్త చూశాడు. ఆ తర్వాత మొబైల్‌లో వచ్చిన ఇతర మెసేజ్‌లను కూడా చదవడంతో భార్య తన స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. అప్పటి నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు.

ముందే ప్రిపేర్ అయి ఉన్న అత్తమామ గదిలో కెమెరాలు పెట్టింది. వారు నగ్న ఉన్న వీడియోలను కలెక్ట్ చేసింది. ఇదంతా ప్రియుడితో కలిసి చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మొత్తం వ్యవహారంపై కూడా విచారణ జరుపుతున్నారు.