Upcoming Movies Web Series: ఈవారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సిత్రాలు, సిరీస్ లు ఇవే..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల సందడి కొనసాగుతోంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానలకైనా ఆడియెన్స్ బ్రేక్ ఇవ్వడంతో చిన్న సినిమాల సందడి జోరుగా సాగుతోంది. అయితే మళ్లీ పెద్ద సినిమాల సందడి మొదలుకానుంది. ఈ దసరా పండుగ సందర్భంగా పెద్ద సినిమాలన్ని పాగా వేసుకుని మరీ రెడీ అయ్యాయి. దీంతో ఒక వారం ముందుగా విడుదలకు రెడీ అవుతూ తమ సత్తా చాటేందుకు ఇటు థియేటర్.. అటు ఓటీటీలో సిద్ధమయయ్యాయి చిన్న సినిమాలు. మరి అవెంటో ఓ లుక్కేద్దామా!

సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది షెర్లీ సేథియా. ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతూ టాలీవుడ్ డెబ్యూగా వస్తున్న మూవీ కృష్ణ వ్రింద విహారి. ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య ఈ మూవీలో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన కృష్ణ వ్రింద విహారి సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తనదైన శైలీలో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు శ్రీ విష్ణు. ఆయన తాజాగా నటించిన చిత్రం అల్లూరి. తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హజరై మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 23నే థియేటర్లలో సందడి చేయనుంది.

సింహా కోడూరి, సముద్ర ఖని, ప్రీతి అస్రాని కీలక పాత్రల్లో నటించిన చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. సతీశ్ త్రిపుర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. టాక్సీ, దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సైతం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

అమ్మ విలువను, ఆమె గొప్పతనం గురించి చాటి చెప్పిన చిత్రం మాతృదేవో భవ. ఇప్పుడు అదే పేరుతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సీనియర్ నటి సుధ, సీనియర్ హీరో సుమన్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కె. హరనాథ్ రెడ్డి డైరెక్షన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్లలో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది మాతృదేవో భవ.

టాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తొలిసారిగా విలక్షణ పాత్రలో నటిస్తున్న చిత్రం పగ పగ పగ. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీ రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించారు. సుంకర బ్రదర్స్ సమర్పణలో క్రైమ్ యాక్షన్ తోపాటు వినోద్మాత్మకంగా సాగే ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులు ఉచితంగా వీక్షించవచ్చని మూవీ యూనిట్ పేర్కొంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో.. అందోర్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 21, ది కర్దాషియన్స్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 22, మిల్కీ బ్యూటీ తమన్నా బౌన్సర్ గా నటించిన బబ్లీ బౌన్సర్- సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో.. డ్యూడ్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20, హష్ హష్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 22న.. ఆహాలో ఫస్ట్ డే ఫస్ట్ షో- సెప్టెంబర్ 23, డైరీ (తమిళ మూవీ)- సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ది పెర్ ఫ్యూమర్- సెప్టెంబర్ 21, జంతరా (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 23, ఎల్ వోయూ- సెప్టెంబర్ 23న.. అలాగే మరో ఓటీటీ వేదిక అయిన జీ5లో అతిథి భూతో భూతో భవ- సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.