Thaar Maar Thakkar Maar Song చిరు, సల్మాన్ మాస్ స్టెప్పుల జోష్.. గాడ్ ఫాదర్ లిరికల్ వీడియో రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అవుతున్నది. ఈ ఏడాది రిలీజ్ అవుతున్న చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్టుగా రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌కు ముందు థార్ మార్ టక్కర్ మార్ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

గాడ్ ఫాదర్ సినిమా లిరికల్ సాంగ్‌ను గతవారమే అభిమానులకు అందించాలని ప్లాన్ చేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే ఈ పాటను మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తార్ మార్ టక్కర్ మార్ లిరికల్ సాంగ్‌ను సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి ముహుర్తం నిర్ణయించారు.

ఇటీవల తార్ మార్ టక్కర్ మార్ పాటకు సంబంధించిన వీడియో ప్రోమోను రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులు, అభిమానులకు కనువిందుగా మారాయి. దాంతో ఈ పాట మరింత ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్నది.

చిరంజీవి, సల్మాన్ ఒకే కలర్, ఒకే డిజైన్ దుస్తులను ధరించి మాస్ స్టెప్పులు వేసి ఆకట్టుకొన్నారు. అయితే ఈ పాట గతంలో వచ్చిన పాటను పోలీన మ్యూజిక్ ఉందంటూ తమన్‌ను భారీగా ట్రోల్స్ చేశారు. ఈ పాటను శ్రేయాఘోషల్ పాడగా, ఆనంత శ్రీరామ్ సంగీతం అందించారు. నయనతార, సత్యదేవ్, సముద్రఖని నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రఫిని, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేశారు.