Pushpa The Rule: పుష్ప 2లో స్టార్ హీరో లవర్.. సమంతను మించిన ట్రీట్‌ ప్లాన్

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, అన్నింటికీ మించి స్టైల్స్ చూపిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలి కాలంలో వరుసగా విజయాలను అందుకుంటూ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది బన్నీ ‘పుష్ప ద రైజ్’ అనే సినిమాలో నటించాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందింది. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి గ్రాండ్‌గా విడుదలైంది.

తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పుష్ప’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి.

‘పుష్ప’ మూవీ రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. ఇందులో భాగంగానే మొదటి దాన్ని ‘పుష్ప.. ద రైజ్’ టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి ‘పుష్ప.. ద రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని కూడా సినిమాలోనే తెలిపారు. ఇందులో పుష్ప రూలర్‌గా మారడాన్ని చూపిస్తారు. ఇదిలా ఉండగా.. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి లీకైంది.

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీలో సమంత రూత్ ప్రభు చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట దేశ వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. దీంతో ఇప్పుడు ఎన్నో అంచనాల నడుమ రూపొందనున్న ‘పుష్ప ద రూల్’ మూవీలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్‌ను పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరో అర్జున్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ మలైకా అరోరా చిందులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన టూన్స్‌ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్‌ – సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక, ‘పుష్ప ద రూల్’లో మరికొందరు ప్రముఖులు నటించబోతున్నారట.