Latest Posts

Janaki Kalaganaledu September 19th: జానకి సరికొత్త ఆలోచన.. భయంతో అఖిల్ కొత్త నాటకం!

జానకి కలగనలేదు ఆసక్తికరమైన ఎమోషన్స్ తో ట్విస్ట్ లతో జనాల్లో మంచి ఆదరణను ఎందుకుంటోంది. ఇక రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి మరిది అఖిల్ మరో అమ్మాయిని ప్రేమించి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలని జానకి ప్రయత్నం చేస్తోంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 390 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

రామచంద్ర తమ్ముడు అఖిల్ జెస్సీ అనే అమ్మాయిని ప్రేమించి ఆమెకు గర్భం వచ్చేలా చేయడంతో జెస్సీ తల్లిదండ్రులు అతనితోనే పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే అఖిల్ మాత్రం తన తల్లి జ్ఞానాంబకు భయపడి ఒక్కసారిగా మాట మార్చేస్తాడు. అసలు జెస్సి గురించి తనకు తెలియదు అంటూ ఆమె గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా అంటాడు. కానీ మరోవైపు జానకి మాత్రం జెస్సికి ఎలాగైనా న్యాయం చేయాలని అనుకుంటుంది ఎందుకంటే ఆమె అఖిల్ తోనే తన జీవితం అంటూ చావడానికిమైనా సిద్ధమే అని చాలా మొండి పట్టుతో ఉండడంతో జానకి తప్పనిసరిగా అఖిల్ ను ఒప్పించాలని అనుకుంటుంది. అఖిల్ మాత్రం తల్లికి భయపడుతూ జానకి రామచంద్ర ఎంత అడిగినా కూడా జెస్సి గర్భంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తప్పించుకుంటాడు.

అయితే ఈ విషయం ఇంతటితో వదిలేస్తే సీరియస్ గా మారుతుంది అని జెస్సి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వెళితే పరువు కూడా పోతుంది అని జానకి ఎంతగానో ఆలోచిస్తుంది. ఆ తరువాత అందరం బాధ పడాల్సి వస్తుందని కూడా రామచంద్ర అనుకుంటాడు. అందుకే అఖిల్ ను ఎలాగైనా నిజం ఒప్పించాలి అని అనుకుంటారు. ఇక అఖిల్ విషయంలో రామచంద్ర, జానకిని మరింత ఉత్తేజ పరుస్తాడు. మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా ఆలోచించకుండా కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ గానే ఈ సమస్యను పరిష్కరించాలని రామచంద్ర ఉత్తేజ పరుస్తాడు.

జానకి కొంతసేపు ఆలోచించి ఈ విషయంలో అఖిల్ నిజం ఒప్పుకోవాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది అంటూ రక్త పరీక్ష చేయించాలి అని జెస్సి గర్భంలో ఉన్న బిడ్డకు అలాగే అఖిల్ రక్తానికి డి.ఎన్.ఎ టెస్ట్ జరిపిస్తే తప్పకుండా చట్టప్రకారం అతను నిజం ఒప్పుకోవాల్సిందే అని జానకి చెబుతుంది. దీంతో రామచంద్ర కూడా అందుకు ఒప్పుకుంటాడు. కానీ రక్తం పరీక్షించడానికి అఖిల్ ఎంతమాత్రం ఒప్పుకోడు అని రామ ముందే అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇక జానకి రామచంద్ర ఆ విషయంలో ఆలోచిస్తూ ఉండగా మరో వైపు జ్ఞానాంబ ఆమె భర్త గోవిందరాజులు ఇద్దరూ కూడా ఇంట్లో సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా జ్ఞానాంబ అయితే జానకి అనవసరంగా లేనిపోని జెస్సి విషయాన్ని తెచ్చుకొని తన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు అని పరీక్షలు కూడా రాయకుండా ఆమె దగ్గరకు వెళ్లడం ఏమాత్రం నచ్చడం లేదు అని జ్ఞానాంబ చెప్తుంది. అయితే అందుకు గోవిందరాజు లో నువ్వు ఎంత సేపు అఖిల్ వైపు నుంచి ఆలోచించడం కరెక్ట్ కాదు.. జానకి వైపు నుంచి కూడా ఆలోచించాలి అని సలహా ఇస్తాడు. అలా మాట్లాడుతూ ఉండగానే మల్లికా హఠాత్తుగా వచ్చి అఖిల్ సూసైడ్ చేసుకోబోతున్నాడు అని గది లోపల డోర్ పెట్టుకొని బయటకు కూడా రావడం లేదు అని చెబుతోంది.

దీంతో హడావిడిగా గోవిందరాజులు జ్ఞానాంబ వెళ్లి అఖిల్ ను బయటకు పిలిచే ప్రయత్నం చేస్తారు. దీంతో అఖిల్ నన్ను ఇంట్లో వదిన అన్నయ్య నమ్మడం లేదు అని జెస్సివిషయంలో నన్ను వేధిస్తున్నారు అని.. అసలు జెస్సికి తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట పట్టించుకోవడం లేదు అని అఖిల్ ఏడుస్తూ చెబుతాడు. ఇక రామ ఆ క్రమంలో తలుపులు బద్దలు కొట్టి అఖిల్ విషం తాగే సమయంలో పట్టుకుంటాడు. అనంతరం అఖిల్ ను జ్ఞానాంబ హాల్ లోకి తీసుకు వాస్తరు.

ఇక అదే అవకాశంగా మల్లిక కూడా మరింత గొడవ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అఖిల్ తనకు సంబంధం లేదు అని ఎంత చెప్పినా కూడా జానకి వినడం లేదు అని.. కావాలని అఖిల్ ను జెసికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది అని లేనిపోని మాటలు చెబుతుంది. దీంతో అత్త జ్ఞానాంబ కూడా జానకి పై సీరియస్ అవుతుంది. నీ కారణంగా ఇప్పుడు పరిస్థితి చచ్చిపోవడం వరకు వచ్చింది అని అంటుంది.

అలాగే రామచంద్ర పై కూడా జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. 20 ఏళ్ల నుంచి చూస్తున్న నీ సొంత తమ్ముడిని నువ్వు నమ్మలే వా అని అడుగుతుంది. భవిష్యత్తులో మన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని ఆలోచనతోనే ఆ విధంగా ఆలోచించాను అని రామచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ జ్ఞానాంబ కోపం ఆగదు. ఇక ఇదంతా జానకి వల్లే వచ్చింది అని ఆమె 5 తప్పులు చేస్తే ఏ మాత్రం క్షమించను అంటూ మొదటి తప్పును కొట్టేస్తున్నాను అని జ్ఞానాంబ చెబుతుంది. మరోసారి తప్పు జరిగితే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను కూడా నాకు తెలియదు అంటూ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటానని అత్తగారు హెచ్చరిక ఇచ్చారు. దీంతో జానకి మళ్ళీ జెస్సి విషయంలో కన్ఫ్యూజన్లో పడుతుంది. మరి ఆమెకు ఏ విధంగా న్యాయం చేస్తుందో చూడాలి.

Latest Posts

Don't Miss