Latest Posts

Golisoda Song: నాటు సారా కిక్కల్లే.. పాయల్‌ రాజ్‌పుత్‌తో శృంగారంగా విష్ణు మంచు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నటుడు నిర్మాత విష్ణు మంచు నిర్మాతగా డాక్టర్ ఎం మోహన్ బాబు సమర్పిస్తున్న చిత్రం జిన్నా. ఈ చిత్రంలో విష్ణు మంచు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జిన్నా చిత్రంలోని గోలిసోడా అనే రొమాంటిక్ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను బాలాజీ రాయగా, నకాశ్ అజీజ్, నూతన మోహన్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నృత్యాన్ని సమకూర్చారు. ఈ పాటను పాయల్ రాజ్‌పుత్, మోహన్ బాబుపై చిత్రీకరించారు.

గోళీసోడావే గుండెకాయ మత్కెక్కే..

పాను బిడావే.. మైండ్ కాస్త పిచ్చెక్కే అందాలే
మెక్కేసావే.. ట్రేండీగా..లుక్కేసావే లక్కీ గా అంటూ సాగే పాట రంజుగా రొమాంటిక్‌గా సాగింది.
మాసు పాట బీటల్లే.. ఉన్నాదే నీ వాకు
నాటు సారా కిక్కల్లే ఉన్నాదే నీ చూపు
నీవెంట పడ్డకే.. పోయిందే దిమాకే.
లిపఫ్ లాక్ ఇస్తే కిర్రాకే..

లాంటి సాహిత్యంతోమాస్ పాటగా తెరకెక్కించారు.

నటీనటులు: విష్ణు మంచు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్
బ్యానర్: అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
సమర్పణ: డాక్టర్ ఎం మోహన్ బాబు
నిర్మాత: విష్ణు మంచు
డీవోపీ: చోటా కే నాయుడు
మ్యూజిక్: అనూప్ రూబెన్
ఎడిటర్: చోటా కే ప్రసాద్
డైరెక్టర్: సూర్య

Latest Posts

Don't Miss