Crime News: 25 ఏళ్ల తర్వాత చిక్కిన హత్య కేసు నిందితుడు.. ఎలాగంటే..

నిజం ఎప్పటికైనా తెలుస్తుంది.నేరస్థుడు ఎన్నటికైనా దొరుగుతాడు. ఇవి తరచూ మనం చెప్పే మాటలు. కానీ ఈ మాటలను నిజం చేశారు పోలీసులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 ఏళ్ల నాటి ఓ హత్యాకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేసి మరి నిందితుడిని పట్టుకున్నారు.ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ప్రాంతంలో నివసించే కిషన్‌లాల్‌ ను 1997 ఫిబ్రవరిలో హత్య చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాము పోలీసులకు చిక్కలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు అనుమానితుడిని ఆచూకీ లభించని వ్యక్తిగా ప్రకటించింది.

దీంతో అందరూ ఈ కేసును మరిచిపోయారు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం మర్చిపోలేదు. పాత కేసుల పరిష్కారంపై శిక్షణ పొందిన ఓ పోలీసుల బృందానికి 2021లో ఈ కేసును అప్పజెప్పారు. ఆ పోలీస్ బృందం వారు అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేశారు.ఇందులో భాగంగా ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్లుగా అవతారమెత్తారు. గతంలో మృతి చెందిన వారి బంధువులకు నగదు సాయం చేస్తున్నట్లు నమ్మించారు.. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో రాము బంధువును గుర్తించారు.

అతని సాయంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాన్‌పూర్ గ్రామానికి చేరుకుని, అక్కడ మరి కొంతమంది బంధువులను పోలీసులు కలిసి రాము కుమారుడు ఆకాశ్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. సిగ్నల్స్ ద్వారా అతన్ని లక్నోలోని కపుర్తలా ఉంటున్నట్లు గుర్తించారు. కపుర్తలాలో ఆకాశ్‌ను కలిసి.. తండ్రి రాము గురించి ఆరా తీశారు. కానీ రాము అశోక్‌ యాదవ్‌గా పేరు మార్చుకుని చలామని అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

తన తండ్రిని చూసు చాలా రోజులైందని ఆకాశ్ పోలీసులకుచెప్పాడు. తన తండ్రి జానకీపురం ప్రాంతంలో ఆటో నడుపుతున్నట్లు మాత్రమే తనకు తెలుసని చెప్పాడు. రాము తమ వెతుకుతున్నట్లు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఓ ఆటో కంపెనీ ప్రతినిధులుగా జానకీపురంలోకి ప్రవేశించారు.

కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కొత్త ఆటోల కొనుగోలుకు రాయితీలు ఇస్తున్నట్లు అక్కడున్న డ్రైవర్‌లతో చెప్పారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 14న ఓ డ్రైవర్‌.. స్థానికంగా రైల్వేస్టేషన్‌ వద్ద నివసిస్తోన్న అశోక్‌ యాదవ్‌(రాము) వద్దకు అండర్‌కవర్‌లో ఉన్న పోలీసులను తీసుకెళ్లడం అండర్ కవర్ ఆపరేషన్ ముగిసింది.