Brahmastra Collections: తెలుగులో వసూళ్ల వర్షం.. 10 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిందీలో ఎంతంటే!

గతంలో మాదిరిగా బాలీవుడ్‌లో ఇప్పుడు సక్సెస్‌లు అంతగా రావడం లేదు. దీనికి కారణం దక్షిణాది చిత్రాల ప్రభావం పెరగడమే. అంతేకాదు, ఇక్కడి సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కుతోంది. దీంతో ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ తేలిపోయాయి. దీంతో హిందీ ఇండస్ట్రీ కోలుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రమే ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్ హీరోగా కొందరు స్టార్లు కూడా నటించిన ఈ చిత్రానికి టాక్ ఆశించినట్లుగా రాలేదు. దీంతో కలెక్షన్లపై ప్రభావం అయితే పడింది. కానీ, తెలుగులో మాత్రం ఈ మూవీ హవా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీ 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

రణ్‌బీర్ కపూర్ – అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌ కాగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ అయింది.

తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

క్రేజీ కాంబోలో భారీ బడ్జెట్‌తో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10వ రోజు వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 40 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్‌ వసూలు అయింది.

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

‘బ్రహ్మాస్త్ర’ మూవీ 10 రోజులకు ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 5.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.37 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 91 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 58 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో.. రూ. 11.91 కోట్లు షేర్, రూ. 22.57 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 11.91 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.41 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

ఏపీ, తెలంగాణలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇక, ఈ సినిమా పదవ రోజు నార్త్ ఇండియా, తమిళనాడు, కర్నాటక, కేరళ ప్రాంతాల్లో కలిపి రూ. 16 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 93 కోట్లు వచ్చాయట. అంటే ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 340 కోట్లు రాబట్టిందట.