Bigg Boss Telugu 6: నైట్ దుప్పట్లో దూరి ఆ కంటెస్టెంట్ల రచ్చ.. అక్కడ గాయాలంటూ నాగార్జునకు కంప్లైంట్

తెలుగులో చాలా రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. అందులో ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షోలలో బిగ్ బాస్ ఒకటి. అంతలా ఈ షో దాదాపు ఐదేళ్లు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనేరికార్డు స్థాయిలో రేటింగ్‌లను కూడా అందుకుంటోంది. ఫలితంగా జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ షో తెలుగులో వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఆరో సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పలువురు కంటెస్టెంట్ల బండారం బట్టబయలు అయింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

తెలుగులో బిగ్ బాస్ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, రేటింగ్ తక్కువగానే వస్తుంది.

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

గత వారం మొత్తంలో బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లు పెద్దగా ఆడింది ఏమీ లేదు. ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా తుస్సుమనిపించారు. దీంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరిపై హెస్ట్ అక్కినేని నాగార్జున ఫైర్ అయ్యాడు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం షాకింగ్‌గా సాగింది. అయితే, ఆదివారం మాత్రం ఫన్నీగా ఉంటుందని ముందుగానే వెల్లడించి టెన్షన్ పోగొట్టాడు.

బిగ్ బాస్ షోలోకి అప్పుడప్పుడూ సెలెబ్రిటీలు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా నాగార్జునతో కలిసి తన సినిమా ట్రైలర్‌ను చూపించిన ఆమె.. ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లను సర్‌ప్రైజ్ చేసింది.

తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో తమన్నా భాటియా ‘బిగ్ బాస్ కానుక’తో హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఆమె లోపలి మేట్ కంటెస్టెంట్లకు ‘లేడీ బౌన్సర్’ అనే టాస్కును ఆడించింది. ఇందులో మగవాళ్లంతా హౌస్‌లో ఉన్న ఆడవాళ్లలో ఒకరిని బౌన్సర్‌గా ఎంపిక చేసుకోవాలి. దానికి కారణం ఏంటి? ఆమె ఎవరి నుంచి రక్షించాలి? అనే వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది.

‘లేడీ బౌన్సర్’ టాస్కులో భాగంగా శ్రీహాన్ చోటూ.. తన బౌన్సర్‌గా ఆరోహిని ఎంపిక చేసుకున్నాడు. ఆ సమయంలో అతడు ‘నేను ఉదయాన్నే లేచే సరికి నా ముఖం మీద, మెడ మీద గుర్తులు ఉంటున్నాయి. అర్జున్ వచ్చినప్పటి నుంచే ఇలా జరుగుతుంది. అవి ఎలా వచ్చాయో కనిపెట్టాలి. అందుకోసమే ఆరోహిని నేను బౌన్సర్‌గా సెలెక్ట్ చేసుకున్నా’ అని షాకింగ్ కామెంట్లు చేశాడు.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

శ్రీహాన్ చోటు తనను లేడీ బౌన్సర్‌గా ఎంపిక చేసుకోవడంతో షాక్ అవ్వని ఆరోహి రావ్.. అతడు చెప్పిన కారణానికి మాత్రం ఒక్కసారిగా షాక్ అయింది. ఆ సమయంలో అసలు విషయాన్ని ఆమె లీక్ చేసేసింది. ‘సార్ వీళ్లు రాత్రి పూట ఒకే దుప్పట్లో ఇద్దరు ముగ్గురు దూరుతున్నారు సార్. అందుకే అలాంటి గుర్తులు వస్తున్నాయి. దుప్పట్లో దూరితే ఇంకేం జరుగుతుంది’ అని చెప్పింది.

అంతేకాదు, ఆరోహి రావ్ మాట్లాడుతూ.. ‘అరే ఏంట్రా ఇది? అంటే మీరు నైట్ టైం సరసాలు ఆడుకుంటుంటే నేను మీకు కాపలా ఉండాలా ఏంటి. ఇదేం దారుణం సార్? ఇలాంటి వాటికి కూడా నేను బౌన్సర్‌గా పని చేయాలా?’ అంటూ ఫన్నీ కామెంట్లు చేసింది. మొత్తానికి ఆ సమయంలో గెస్టుగా వచ్చిన తమన్నా భాటియాతో పాటు అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వుకున్నారు.