Bigg Boss Nominations: 3వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్.. ఈసారి 9 మంది.. టైటిల్ ఫేవరెట్‌కు మరో షాక్

తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల నుంచి మద్దతును కూడగట్టుకుని సూపర్ డూపర్ హిట్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు తీసుకు రావడంతో పాటు కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ నిర్వహకులు షోను మరింత రంజుగా నడిపిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కూడా పూర్తి చేశారు. దీంతో ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్ మూడో వారం నామినేషన్స్ లిస్ట్ లీక్ అయింది. ఇంతకీ ఈ సారి ఎవరెవరు నామినేట్ అయ్యారో చూద్దాం పదండి!

బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అవడంతో దీని నుంచి ఆరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఇది మొదలైంది. ఇందులో ఆరంభం నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఆరంభంలో రంజుగానే సాగింది. కానీ, ఎందుకనో ఈ సీజన్‌కు ప్రేక్షకుల స్పందన రావడం లేదు. దీంతో రేటింగ్ తగ్గిపోతూ వస్తోంది.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో మొదటి వారం మాత్రం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు.

నామినేషన్స్ ప్రక్రియ అనేది బిగ్ బాస్ షోలోనే ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి. ఈ ప్రక్రియ జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా పుడుతుంది. ఇక, మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడంతో రెండో వారం ఇద్దరిని పంపేశారు. దీంతో మూడో వారం నామినేషన్స్‌పై ఆసక్తి నెలకొంది.

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

బిగ్ బాస్ షోలో సాధారణంగా నామినేషన్స్ టాస్కును సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే చూపిస్తుంటారు. ప్రతి సీజన్‌లోనే ఇలానే చేశారు. అయితే, ఆరో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నుంచి నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే పెట్టారు.

బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో మాదిరిగానే నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి కంటెస్టెంట్.. సరైన కారణాన్ని చెప్పి నామినేట్ చేసే కంటెస్టెంట్ ముఖంపై ఎరుపు రంగును పూయాల్సి ఉంటుంది.ఇక, ఈ టాస్కు ఎన్నో గొడవలతో రంజుగా సాగినట్లు కూడా తెలుస్తోంది.

తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని మూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వారిలో వాసంతి కృష్ణన్, ఇనాయా సుల్తానా, శ్రీహాన్ చోటూ, నేహా చౌదరి, ఆరోహి రావ్, చలాకీ చంటి, బాలాదిత్య, సింగర్ రేవంత్, గీతూ రాయల్ ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒకరిద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. వారిలో సింగర్ రేవంత్ ఒకడు. బయట భారీ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీ కావడంతో అందరూ అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఫలితంగా మొదటి రెండు వారాలూ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు మూడో వారంలోనూ అతడికి షాక్ తగిలినట్లు సమాచారం.