Anshumalika: రోజా కూతురు వెండితెర ఎంట్రీ.. తెలుగు హీరోతో కాకుండా అతనితో లవ్ స్టొరీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు అందుకున్న రోజా ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక ఆమె కూతురు అన్షుమాలిక ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక త్వరలోనే ఆమె కూడా వెండితెరపైకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక ఆమె మొదటి సినిమా తెలుగు హీరోతో కాకుండా ఒక తమిళ హీరోతో అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

రోజా గారాల కూతురు అన్షుమాలిక అందమైన చిరునవ్వుతో చూడగానే ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటికే ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఒక్క ఫోటో పోస్ట్ చేసిన కూడా ఈజీగా ట్రెండింగ్ లిస్టులోకి వచ్చేస్తుంటాయు. ఆ విధంగానే ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

2021లో అన్షుమాలిక యూకే లోని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మ్యాగజైన్ పై కనిపించింది. ఒక్కసారిగా అందరూ తనవైపు తిరిగేలా గుర్తింపు అందుకుంది. పలు సామాజిక అంశాలలో సమాజం కోసం కృషి చేసినందుకు ఆమె ‘యంగ్‌ సూపర్‌స్టార్‌’ అవార్డును గెలుచుకుంది. తన కూతురు ఎప్పుడు కూడా పేద వారికి సహాయం చేసేందుకు కృషి చేస్తుందని రోజా పలు ఇంటర్వ్యూలలో తెలియజేసింది.

ఇక అన్షుమాలిక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే డాన్స్ యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పింది లేదు. రోజా కూడా అధికారికంగా తన కూతురు సినిమాల్లోకి రాబోతుంది అని వివరణ అయితే ఇవ్వలేదు.

ఇక లేటెస్ట్ బజ్ ఏమిటంటే ఆమె మొదట తెలుగు హీరోతో చేయడం లేదట. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌తో జతకట్టనుందని టాక్ వస్తోంది. సీనియర్ విక్రమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌తో తన కొడుకును టాలీవుడ్‌లో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక మంచి తెలుగు హీరోయిన్ అయితే బెటర్ అని రోజా కూతురుని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

విక్రమ్ ఇప్పటికే పవర్ఫుల్ లవ్ స్క్రిప్ట్ రెడీ చేయించినట్లు టాక్. అదే సమయంలో ధృవ్‌ కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తుండగా అన్షుమాలికకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారట. ఇటీవల అన్షుమాలిక యునైటెడ్ స్టేట్స్‌లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సీటు సంపాదించింది అక్కడే ఆమె యాక్టింగ్ కోర్సును చేపట్టనుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత, అన్షు సినిమాలకు సిద్ధంగా ఉంటుంది.