Allu Arjun ఆక్సిజన్ లేని చోట అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మాటకు కట్టుబడే వ్యక్తి.. శ్రీవిష్ణు ఎమోషనల్

ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ సొంత బ్యానర్ లక్కీ మీడియాపై నిర్మించిన చిత్రం అల్లూరి. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈచిత్రానికి నూతన దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. శ్రీవిష్ణు, కాయడు లోహర్ హీరో, హీరోయిన్లు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి హీరో శ్రీ విష్ణు భావోద్వేగంతో మాట్లాడుతూ..

నా కెరీర్ ఆరంభంలో పిలిచి వేషాలు ఇచ్చిన హీరో అల్లు అర్జున్. లవ్ ఇష్క్ కాదల్‌లో వేసిన చిన్న వేషం చూసి.. నాకు రేసు గుర్రం చిత్రంలో వేషం ఇచ్చారు. ఆ సమయంలో కంటెంట్ ఉన్న సినిమాలు చేయమని చెప్పారు. ఆయన సలహాతో నేను కంటెంట్ ఉన్న సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మళ్లీ అల్లు అర్జున్ నుంచి కాల్ వచ్చింది. మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ అని అన్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. మారు మాట్లాడుకుండా నేను షూటింగుకు వెళ్లిపోయాను. ఆ తర్వాత మేనేజర్ వచ్చి.. మీ రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు. మీ పారితోషికం ఎంత అంటే.. ఆయన ఇచ్చిన అవకాశానికి వెలకట్టలేం. ఇండస్ట్రీలో దమ్మున్న హీరో అల్లు అర్జున్. ఆయనకు టన్నుల కొద్ది ధైర్యం ఉంది అని శ్రీ విష్ణు అన్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత అయ్యప్ప దర్శనానికి వెళ్లాను. అయితే నన్ను చూడటానికి చాలా మంది ఉత్సాహపడ్డారు. దాంతో నాకు కేరళలో కూడా ఫాలోయింగ్ ఉందని ఫీలయ్యాను. అయితే తీరా తెలుసుకొంటే.. సన్నాఫ్ సత్యమూర్తిలో నటించావు కదా అంటే.. అప్పుడు అల్లు అర్జున్‌కు ఉన్న బీభత్సమైన క్రేజ్ ఏంటో అర్ధమైంది.

కరోనా తర్వాత ఆక్సిజన్ సరిగా లేని కచ్ తదితర ప్రాంతాలకు వెళ్లాను. అక్కడ ఓ డ్రైవర్ చూసి.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా పాత్ర డైలాగ్స్ అన్నీ చెప్పారు. నీవు ఎక్కడ చూశావంటే.. యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ చూశానని చెప్పాడు. దాంతో చిన్నతెర మీద చూస్తేనే ఇలా ఫీలయైతే.. బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో అని అనుకొన్నాను. సార్.. మీకు ఆక్సిజన్ లేని చోట కూడా మీకు ఫ్యాన్స్, మీ ఆర్మీ ఉంది అని ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు శ్రీవిష్ణు గుర్తు చేశారు.

అల్లు అర్జున్‌కు క్రేజ్ ఇలా ఉన్న సమయంలోనే పుష్ప వచ్చి తప్పు రేగొట్టింది. అందరూ దేశం మొత్తం ప్రమోషన్స్ చేసి ప్యాన్ ఇండియా అంటారు. కానీ మా బన్నీ హైదరాబాద్‌లో ప్రమోషన్స్ చేస్తే.. పాన్ ఇండియా షేక్ అవుతుంది. ఫిలింనగర్‌లో ప్రమోషన్ చేస్తే.. పాన్ వరల్డ్ అవుతుంది. ఇది మా అల్లూరి సినిమా ప్రమోషన్స్‌కు వచ్చానని చెప్పడం లేదు. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానాన్ని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అవకాశం లభించడంతో అల్లు అర్జున్ ముందే చెప్పాను. నిజంగా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే.. చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నటీనటులు: శ్రీవిష్ణు, కాయడు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర తదితరులు
బ్యానర్: లక్కీ మీడియా
డైరెక్టర్: ప్రదీప్ వర్మ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
సహ నిర్మాత: బెక్కెం బబిత
మ్యూజిక్ డైరెక్టర్: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫి: రాజ్ తోట
ఎడిటర్: ధర్మేంద్ర కకరాల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
రిలీజ్: 2022-09-23