Actress Deepa: హీరోయిన్ ఆత్మహత్య.. కీలకంగా మారిన సూసైడ్ నోట్..

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ఒకరి మరణ వార్త తర్వాత మరొకరి కన్నుమూత సినీ ఇండస్ట్రీని కలిచివేస్తుంది. కొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు బలవన్మరణాలతో మరణిస్తున్నారు. ఈ మధ్యనే ఆగస్టు 28న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ తండ్రి మోన్ రావు కాలేయ వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ యువ నటి దీప అలియాస్ పౌలిన్ జెస్సికా ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమె ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ హాట్ టాపిక్ గా మారింది.

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద సంఘటనలు కలిచివేస్తున్నాయి. ఇప్పటికే సీనియర్​ హీరోయిన్​ మీనా భర్త విద్యా సాగర్ మరణించగా, ఆ వెంటనే ప్రముఖ సీనియర్ ఫిల్మ్​ ఎడిటర్​ గౌతమ్​ రాజు, అనంతరం నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్​, ఆర్​ నారాయణ మూర్తి తల్లి, డైరెక్టర్ బాబీ తండ్రి మోహన్ రావు మరణించారు. వీరి మరణ వార్తలు సినీ లోకాన్ని కలిచివేశాయి.

తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ దీప అలియాస్ పౌలిన్ జెస్సికా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య అనంతరం దీప సూసైడ్ నోట్ కీలకంగా మారింది. ప్రస్తుతం దీప సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చెన్నైలోని విరుగంబాక్కంలో నివాసం ఉంటోన్న దీప తన గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు. అలాగే ఆమె గదిలో లభించిన సూసైడ్ నోట్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను చక్కదిద్దుకుంటున్న దీప ప్రేమ కారణంగానే బలవన్మరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయినట్లు, కొన్ని అనివార్య కారణాల వల్ల జీవితంలో తలెత్తిన సమస్యలను అధిగమించలేకనే దీప ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఆ సూసైడ్ నోట్ లో.. తన చావుకు కారణం ఎవరు కారణం కాదని, తను జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటానని రాసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే ఆమె ఎవరిని ప్రేమిస్తుందనే విషయం మాత్రం ఆ నోట్ లో రాసుకురాలేదు దీప. ప్రస్తుతం దీప మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఫోన్ కాల్స్ చెక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.

కాగా, దీప ఆత్మహత్యకు ముందు రోజు నుంచి ఆమెతో మాట్లాడాలని దీప కుటుంబసభ్యులు కాల్ చేయగా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి దీప స్నేహితుడు ప్రభాకరన్ కు సమాచరం ఇవ్వగా, అతను వెళ్లి దీప గదిలో చూసేసరికి ఫ్యాన్ కు ఉరి వేసుకుని దీప కనిపించింది. ఇదిలా ఉంటే, దీప అనేక కోలీవుడ్ సినిమాల్లో నటించింది.

ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించిన తూప్పరివాలన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది దీప. అలాగే ఈ మధ్య విడుదలైన వైధా చిత్రంలో హీరోయిన్ గా సైతం అలరించింది. చిన్న వయసులోనే దీప మరణించడంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.