మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో

     Bredcrumb

Updated: Monday, September 19, 2022, 14:41 [IST]  

ఆదిమమానవుడి నుంచి ఈ రోజు వారు మనిషి ప్రతి రోజూ అభివృద్ధివైపు నడుస్తూనే ఉన్నాడు. అయితే ఇందులో కొంతమంది మానవత్వం అనే మాటను మాత్రం మరచిపోతున్నారు. జీవహింస నేరమని ప్రబోధించిన బుద్ధభగవానుడు పుటిన భూమిలో పుట్టిన ఒక మనం తప్పకుండా తోటిమనిషిని ప్రేమించాలి, ప్రేమించకపోయినా వారికి ఎటువంటి హానీ తలపెట్టకూడదు. అయితే జంతువులకు సైతం ఏ కీడు తలపెట్టకూడదు.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో చూస్తుంటే, మానవత్వం చచ్చిపోయిందేమో అని తప్పకుండా అనిపిస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి, ఆ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

    మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో  నివేదికల ప్రకారం, ఈ సంఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ వైరల్ అయినా వీడియోలో ఒక వ్యక్తి ఒక కుక్క మెడకు తాడును కట్టి, ఆ తాడుని కారుకు కట్టేసి లాక్కుంటూ వెళ్తున్నాడు. కారు వేగానికి ఆ కుక్క పరుగెత్తలేక రోడ్డుపైన అటూ, ఇటూ కదులుతోంది. ఈ సంఘటనను మీరు వీడియోలో కూడా చూడవచ్చు.

మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో

కారు వెళ్తున్న వేగంతో కుక్క పరుగెత్తలేక చాలా కష్టపడుతోంది. ఈ సంఘటనలో ఆ కుక్క ఒక కాలుకి ఫ్రాక్చర్ అయినట్లు, మరొక కాలుకు బాగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆ కుక్కను లాక్కుంటూనే వెళ్తున్నాడు. దీన్ని గమనించిన కొంతమంది ఆ కారుని వెంబడించి ఆపారు.ఈ వీడియోలో కనిపించే కారు హ్యుందాయ్ కంపెనీకి చెందినదని తెలుస్తోంది.

మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో ఈ సంఘనకు పాల్పడిన వ్యక్తి ఒక డాక్టర్ అవ్వడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం, ప్రాణాలు పొసే డాక్టర్ ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ డాక్టర్ పేరు రజనీష్ గాల్వా, యితడు రాజస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ అని తెలిసింది.

మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిపైన కొంతమంది కేసు నమోదు చేయాలనీ పోలీసులను కోరారు. అయితే పోలీసులు కూడా ఆ డాక్టర్ కె సంహరించారు. అయితే కొంత సమయం తరువాత ఆ డాక్టర్ పైన యానిమల్ క్రుయెల్టీ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్‪లో కేసు నమోదు చేశారు. ఆ కుక్క ఈ సంఘటనలో బాగా గాయపడిందని డాగ్ హోమ్ ఫౌండేషన్ కేర్ టేకర్ తెలిపారు.

మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో ఈ సంఘటను పాల్పడిన డాక్టర్ గ్వాలాకు కాల్స్ చేసినప్పటికీ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. కాబట్టి ఈ విషయంపైన 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, కంట్రోలర్ డాక్టర్ దిలీప్ కచవాహా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ సంఘటనలో గాయపడిన ఆ కుక్కకు చికిత్స చేయడానికి కూడా పోలీసులు అంగీకరించకపోవడం ఇక్కడ గమనార్హం. ఆ తరువాత పోలీసులు ఆ డాక్టర్ పైన కేసు నమోదు చేయడానికి మరియు ఆ కుక్కలు ట్రీట్మెంట్ అందించడానికి ఒప్పుకున్నారు. జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకాగాంధీని ‘డాగ్ హోం ఫౌండేషన్’ ట్యాగ్ చేసింది.

మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో ఈ సంఘటనపైన ఆ డాక్టర్ మాట్లాడుతూ, ఆ కుక్క తరచూ ఇంట్లోకి వస్తుందని, అంతే కాకుండా ఇంటిబయట కూడా ఎప్పుడూ అరుస్తూ ఉంటుందని, అందుకే ఆ కుక్కను కార్పొరేషన్ ఎన్ క్లోజర్‌లో వదిలేయడానికి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. అయితే దీనిపైన పోలీసులు పూర్తి విచారణ జరపవలసి ఉంది.

మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో గతంలో కూడా ఇలాంటి ఒక సంఘటన కేరళలో జరిగింది. దీనికి కారకుడైన కారు డ్రైవర్ ని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రైవర్ ఒక కుక్కను కారు వెనుక భాగానికి ఒక దారంతో కట్టి దాదాపు రెండు కిలోమీటర్లు లాగుతూ అతని క్రూర ప్రవర్తనను చూపించాడు. ఈ కారణంగా పోలీసులు అతడిపైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ వ్యక్తి కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎంతో విశ్వాసంగా ఉండి, యజమానుల కోసం ప్రాణాలు సైతం వదిలేసి కుక్కలను ఇలా చేయడం నిజంగానే ఖండించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనపైన పోలీసులు విచారణ జరిపి దీనికి కారకుడైన డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కారు మారియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

          English summary

Fir against rajasthan doctor who tortured to dog details