మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలంటే?

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి మహీంద్రా కంపెనీ ఇప్పటికి తన స్కార్పియో-ఎన్ కోసం ఏకంగా 1.50 లక్షల బుకింగ్స్ స్వీకరించింది. అయితే ప్రస్తుతం కంపెనీ ప్రాధమిక దశలో 25,000 యూనిట్ల డెలివరీలకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. మిగిలిన బుకింగ్స్ మరో రెండు సంవత్సరాల లోపు డెలివరీ చేస్తుంది.

 మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి

వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉన్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ కస్టమర్లు మాత్రం ఇంకా బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతూనే ఉన్నారు. కావున రానున్న పండుగ సీజన్లో మహీంద్రా స్కార్పియో-ఏన్ మరిన్ని బుకింగ్స్ పొందే అవకాశం ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి కంపెనీ డెలివరీలను ప్రారంభించిన తరువాత ముందుగా ఎక్కువ సంఖ్యలో Z8 L వేరియంట్‌లను డెలివరీ చేసే అవకాశం ఉంది. మహీంద్రా యొక్క కొత్త స్కార్పియో-ఎన్ మొత్తం 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు Z8 L. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలతో అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క Z2 వేరియంట్ కోసం 22 నెలలు, Z4 వేరియంట్ కోసం 24 నెలలలోపు, Z6 మరియు Z8 వేరియంట్స్ కోసం 2 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది. అయితే టాప్ వేరియంట్ అయిన Z8 L కోసం సుమారు 20 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే టాప్ వేరియంట్ బుక్ చేసుకునేవారు డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన సమయం మిగిలిన వేరియంట్స్ కంటే కూడా తక్కువ.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి కొత్త స్కార్పియో-ఎన్ మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి-షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కూడా ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి ఫీచర్స్ విషయానికి వస్తే, మహీంద్రా స్కార్పియో-ఎన్ లో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి మహీంద్రా స్కార్పియో-ఎన్ లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్‌లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో మహీంద్రా థార్ మరియు XUV700 తరువాత అతి తక్కువ కాలంలో ఎక్కువ బుకింగ్స్ పొందిన మూడవ మహీంద్రా కారు ఈ స్కార్పియో-ఎన్. ఈ కొత్త మోడల్ కోసం ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వస్తోంది. దీన్నిబట్టి చూస్తే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ అర్థమవుతుంది. కావున డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఉత్పత్తి మరియు డెలివరీలను మరింత వేగవంతం చేయాల్సి ఉంది.