భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్!

     Bredcrumb

Updated: Monday, September 19, 2022, 14:52 [IST]  

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి మరొక చైనీస్ మోడల్ ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన బివైడి ఆటో (BYD Auto), ఇటీవలే భారతదేశంలో ప్రత్యక్షంగా తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ చైనీస్ బ్రాండ్ భారతదేశంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.

బివైడి ఆటో తమ భారతీయ అనుబంధ సంస్థ బివైడి ఇండియా (BYD India) ను ప్రారంభించడం ద్వారా ఇక్కడి మార్కెట్లో ప్రత్యక్ష వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లో బివైడి ఇ6 (BYD e6) అనే ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు బివైడి అట్టో 3 (BYD Atto 3) పేరుతో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే, ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన టీజర్లను విడుదల చేసిన కంపెనీ, తాజాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడి చేసింది. అవేంటో చూద్దాం రండి.

    భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్!  బివైడి అట్టో 3 - డిజైన్

బివైడి అట్టో 3 ముందు వైపు నుండి చుడటానికి కియా కారెన్స్ మాదిరిగా కనిపిస్తుంది. ఇరువైపులా సన్నటి హెడ్‌ల్యాంప్స్ మరియు వాటి పైభాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఆ రెండింటినీ కలుపుతూపోయే క్రోమ్ బార్, క్రింది భాగంలో రెండు చిన్న ఎయిర్ వెంట్‌లతో కూడిన సాలిడ్ ఫ్రంట్ బంపర్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బ్లాకవుట్ చేయబడిన బి, సి పిల్లర్స్, ఫాక్స్ రూఫ్ రెయిల్స్, వెనుక వైపున కనెక్టింగ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ను ఇందులో గమనించవచ్చు.

భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్!

బివైడి అట్టో 3 - ఫీచర్లు

బివైడి అట్టో 3 ఇంటీరియర్ చాలా క్లీన్‌గా, అతి తక్కువ భౌతిక బటన్లతో మంచి ఫ్యూచరిస్టిక్ లుక్‌ని కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డు మధ్యలో అమర్చిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ సాయంతోనే కారులోని అనేక ఫీచర్లు కంట్రోల్ చేయబడుతాయి. ఇంకా ఇందులో లెవెల్-2 అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్‌తో పాటుగా స్టాప్ అండ్ గో ఫంక్షన్‌తో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలైజన్ వార్నింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్, డోర్ ఓపెన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలెర్ట్ వంటి మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్! బివైడి అట్టో 3 – పవర్‌ట్రైన్, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ మరియు రేంజ్

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, రాబోయే BYD Atto 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గరిష్టంగా 201 బిహెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ మోటార్ కారణంగా, ఇది ఈ విభాగంలోని ఇతర ఎలక్ట్రిక్ కార్ల కన్నా చాలా శక్తివంతమైనదిగా నిలిచేలా చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని ఆన్‌లైన్ లో లీకైన బ్రోచర్ వెల్లడిస్తోంది. మరి రియల్ వరల్డ్‌లో ఇదెలా పని చేస్తుందో చూడాలి.

భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్! ఆన్‌లైన్‌లో లీక్ అయిన బ్రోచర్ ప్రకారం, రాబోయే బివైడి అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇందులో మొదటిది 49.92 kWh బ్యాటరీ ప్యాక్ మరియు రెండవది 60.48 kWh బ్యాటరీ ప్యాక్. ఇక రేంజ్ విషయానికి వస్తే, చిన్న 49.92 kWh బ్యాటరీతో కూడిన బివైడి అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 345 కిలోమీటర్ల (WLTP సైకిల్) సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే, పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన అట్టో 3 ఇ-ఎస్‌యూవీ పూర్తి చార్జ్ పై 420 కిలోమీటర్ల (WLTP సైకిల్) సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్! బివైడి అట్టో 3 – కొలతలు

లీకైన బ్రోచర్ ప్రకారం, కొత్త బివైడి అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పొడవు 4,455 మిమీ, వెడల్పు 1,875 మిమీ మరియు ఎత్తు 1,615 మిమీగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ వీల్‌బేస్ 2,720 మిమీగా ఉంటుంది. ఈ కొలతలను బట్టి చూస్తుంటే, బివైడి అట్టో 3 ఈ విభాగంలోనే పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా తెలుస్తోంది. పెద్ద పరిమాణం కారణంగా, ఈ ఎస్‌యూవీ లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంటుందని మేము భావిస్తున్నాము.

భారత మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. బివైడి అట్టో 3 (BYD Atto 3) గురించి ఫుల్ డీటేల్స్! బివైడి అట్టో 3 – పోటీ, ధర

భారత మార్కెట్లో ప్రారంభించబడినప్పుడు, బివైడి అట్టో3 ఈ విభాగంలో ఇప్పటికే అత్యంత పాపులర్ అయిన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా వంటి మోడళ్లతో నేరుగా పోటీ పడుతుంది. అలాగే, ఇది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, కియా ఈవీ6 వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలపై కూడా స్వల్పంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, భారత మార్కెట్లో బివైడి అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. సమాచారం ప్రకారం, ఇది అక్టోబర్ 11న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

          English summary

Byd atto 3 electric suv to be launched in india soon all you need to know about this ev