గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు..

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. టొయోట హైరైడర్ (Toyota Hyryder):

దేశీయ విఫణిలో టొయోట కంపెనీ తన ‘హైరైడర్’ ని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యువి ధరలను అప్పుడే వెల్లడించింది. అయితే కంపెనీ అన్ని వేరియంట్స్ ధరలను వెల్లడించలేదు. ఇప్పటికి కేవలం నాలుగు వేరియంట్స్ ధరలను మాత్రమే వెల్లడించింది.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు..

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, దేశీయ విఫణిలో కొత్త హైరైడర్ ప్రారంభ ధరలు రూ. 15.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ ధర రూ 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున ఆసక్తిగల కస్టమర్లు ముందస్తుగా రూ. 25,000 చెల్లింది టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. టొయోట హైరైడర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌ (Audi Q7 Limited Edition):

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ (Audi) దేశీయ మార్కెట్లో గత వారం కొత్త క్యూ7 ‘లిమిటెడ్ ఎడిషన్‌’ విడుదల చేసింది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం ఇది కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. కావున ఈ కొత్త లగ్జరీ కారుని కేవలం 50 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. కొత్త ఆడి క్యూ7 ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 48వి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 336.6 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటుంది. ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. టాటా సఫారీ కొత్త వేరియంట్స్:

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, గత వారంలో సఫారీ మోడల్ లో మరో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసింది. అవి సఫారి XMAS మరియు సఫారి XMS. వీటి ప్రారంభ ధరలు రూ. 17.96 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ కొత్త వేరియంట్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడే https://cars.tatamotors.com/suv/safari వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. ప్రస్తుతం టాటా సఫారీ యొక్క XMAS మరియు XMS వేరియంట్‌లు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్‌లలో పనోరమిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 8 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ యొక్క కొత్త వేరియంట్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. టాటా హారియర్ కొత్త వేరియంట్స్:

గత వారం విడుదలైన కొత్త కార్ల జాబితాలో టాటా మోటార్స్ యొక్క హారియర్ కొత్త వేరియంట్స్ అయిన హారియర్ XMAS మరియు హారియర్ XMS కూడా ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 17.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండు వేరియంట్లు ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతాయి.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. కొత్త టాటా హారియర్ XMS మరియు XMAS వేరియంట్లు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కావున ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి వాటితోపాటు ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. టాటా హారియర్ కొత్త వేరియంట్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు.. డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో వాహన కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో వాహనా తయారీ సంస్థలు కూడా కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. గత వారంలో విడుదలైన వాహనాల గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకున్నారు, కదా.. ఇలాటి మరిన్ని కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.