ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా

     Bredcrumb

Updated: Monday, September 19, 2022, 16:42 [IST]  

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. హోండా టూవీలర్స్ భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (HMSI) లిమిటెడ్, దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2023 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా  భారత టూవీలర్ మార్కెట్లో హోండా వివిధ విభాగాలలో బహుళ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, వాటి డిజైన్ లేదా పవర్‌ట్రెయిన్ గురించి ఇంకా ఎలాంటి వివరాలు తెలియరాలేదు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మార్కెట్లో అన్ని ప్రధాన ద్విచక్ర వాహన తయారీదారులు ఈవీ విభాగంలో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా

ఓలా ఎలక్ట్రిక్ మరియు ఏథర్ ఎనర్జీ వంటి మెయిన్‌స్ట్రీమ్ ఈవీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో రాణిస్తుండగా, బజాజ్ ఆటో మరియు టీవీఎస్ మోటార్ వంటి ట్రెడిషనల్ టూవీలర్ కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశించాయి. తాజాగా, హీరో మోటోకార్ప్ కూడా వచ్చే నెలలో తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు, ఈ జాబితాలో హోండా మోటార్‌సైకిల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. అయితే, హోండా బ్రాండ్ తొలి ఉత్పత్తిని రోడ్లపై చూడాలంటే మాత్రం 2023 వరకూ ఆగాల్సిందే.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా  ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్న ప్రధాన బ్రాండ్లలో హోండా కూడా ఒకటి. భారతదేశానికి హోండా ఈవీలు కొత్తవే అయినప్పటికీ, ఈ బ్రాండ్ పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా విక్రయిస్తోంది. తాజాగా వచ్చిన కార్ అండ్ బైక్ నివేదిక ప్రకారం, మొదటి హోండా ఎలక్ట్రిక్ టూవీలర్ ఏప్రిల్ 2023లో విడుదల అయ్యే అవకాశం ఉంది. కేవలం, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోనే కాకుండా, ఇతర విభాగాలలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని హోండా ప్లాన్ చేస్తోంది.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా భారతదేశం కోసం హోండా ప్లాన్ చేస్తున్న ఇతర ఈవీ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ బైక్ కూడా ఒకటి. గంటకు 25 కిలోమీటర్ల పరిమిత వేగంతో నడిచే లో-స్పీడ్ ఈవీలు ఈ విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ లో-స్పీడ్ ఈవీలను నడపడానికి రైడర్లకు లైసెన్స్ మరియు వాహనాలకు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. అలాగే, ఎలక్ట్రిక్ మోపెడ్ సెగ్మెంట్‌లో, గంటకు 50 కిలోమీటర్ల పరిమిత వేగంతో నడిచే వాహనాలు కూడా ఉండనున్నాయి. ఇవి ప్రత్యేకించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు ఇ-కార్గో విభాగంలో అందుబాటులోకి రానున్నాయి.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ.. హోండా మొదట మోపెడ్ సెగ్మెంట్‌లో ఈవీని లాంచ్ చేస్తుందని మరియు ఇది ఏప్రిల్ 2023లో జరుగుతుందని ధృవీకరించారు. ఆ తర్వాత, హోండా హై-స్పీడ్ ఈవీ వస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో హోండా కూడా ఈవీ విభాగంలోకి రావడం ఖాయమైన స్పష్టమైంది. అదే సమయంలో, హోండా పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లపై కూడా దృష్టి సారిస్తుందని అట్సుషి ఒగాటా వెల్లడించారు.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా రాబోయే రెండు మూడేళ్ల వరకూ హోండాకు ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం సెకండరీ ఫోకస్ మాత్రమేనని, ప్రస్తుతం తమ దృష్టి అంతా మెయిన్ స్ట్రీమ్ పెట్రోల్ టూవీలర్లపైనే ఉంటుందని హోండా తెలిపింది. ఇదిలా ఉంటే, హోండా చాలా కాలంగా భారత మార్కెట్ కోసం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురావడంపై పనిచేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని పేర్లను కూడా కంపెనీ ట్రేడ్‌మార్క్ చేసింది. తాజాగా హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ ను కూడా పేటెంట్ చేసింది.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే భారతదేశంలో రెండు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో హోండా యు-గో, హోండా స్కూపీ అనే పేర్లు ఉన్నాయి. హోండా యూ-గో పేరుతో కంపెనీ ఇప్పటికే చైనాలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్‌లో ట్రేడ్‌మార్క్ చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కూడా ఇదే పేరుతో విక్రయించవచ్చని భావిస్తున్నారు. హోండా పేటెంట్ చేసిన ఇ-స్కూటర్ డిజైన్‌ను గమనిస్తే, దాని హ్యాండిల్‌బార్ మరియు హెడ్‌లైట్ భాగం చూడటానికి ప్రస్తుత యాక్టివా మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. మిగిలిన బాడీవర్క్ అంతా లేటెస్ట్‌గా ఉంటుంది.

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా హోండా దాఖలు చేసిన పేటెంట్‌లో స్కూటర్ డిజైన్‌తో పాటుగా హబ్-మౌంటెడ్ మోటార్ యొక్క డిజైన్ కోసం కూడా పేటెంట్ చేసింది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, హోండా ఇ-స్కూటర్ కూడా హబ్-మౌంటెడ్ మోటారుతో అమర్చబడి ఉంటుంది. ఈ డిజైన్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిచ్చే బ్యాటరీతో పాటు, స్కూటర్‌లోని ఇతర భాగాలకు శక్తినిచ్చే 12 వోల్ట్ బ్యాటరీ యూనిట్‌ను కూడా చూపుతుంది. లీకైన చిత్రాల ప్రకారం, హోండా ఇ-స్కూటర్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు సింగిల్ రియర్ స్ప్రింగ్‌తో అమర్చబడి సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

మూలం: Car&Bike

          English summary

Honda to launch its first electric two wheeler in april 2023 more evs coming from honda