ఇద్దరితో డేటింగ్.. నా కూతురికి ఆ విషయంలో చెప్పేది ఒక్కటే..: షారుక్ ఖాన్ భార్య

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య ప్రేమ ఎంత తొందరగా చిగురిస్తుందో అంతే తొందరగా అది మాయమవుతుంది అని కూడా అప్పుడప్పుడు కొంతమంది స్టార్స్ నిరూపిస్తూ ఉంటారు. ఇక డేటింగ్ బ్రేకప్స్ గురించి నిత్యం ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. అయితే రీసెంట్ గా షారుఖాన్ సతీమణి గౌరీ ఖాన్ తన కూతురు డేటింగ్ చేసే ప్రక్రియలో ఇచ్చే కీలకమైన సలహా ఒకటి ఉంది అంటూ ఆమె ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం విశేషం. అందుకు సంబంధించిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవల పాల్గొన్న షారుఖాన్ సతీమణి గౌరీ ఖాన్ అనేక విషయాలపై స్పందించింది. అంతేకాకుండా తన భర్త గురించి తన కుటుంబ సభ్యుల గురించి ఇక తన పర్సనల్ బిజినెస్ వ్యవహారాల గురించి కూడా ఆమె టెలివిజన్ షో ముందు వివరంగా తెలియజేసింది. ఇక లేటెస్ట్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

మోస్ట్ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లోని 12 ఎపిసోడ్లోకి షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేక గెస్ట్ గా రావడం విశేషం. ఆమెతోపాటు సంజయ్ కపూర్ భార్య మహీబ్ కపూర్ కూడా వచ్చారు. అలాగే వీరికి తోడుగా చంకీ పాండే భార్య కూడా వీరికి తోడుగా వచ్చింది.

అయితే గడిచిన ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా కరణ్ జోహార్ ఎక్కువగా శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ స్టార్స్ చేత చాలా బోల్డ్ సమాధానాలను రాబట్టాడు. ఎవరు వచ్చినా కూడా ముందుగా శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే ఈసారి సీనియర్ స్టార్స్ నటీమణులు కావడంతో కరణ్ మరింత అంతా హై డోస్ ప్రశ్నలు అయితే అడగలేదని తెలుస్తోం

ఎక్కువగా అయితే నేటి తరం జనరేషన్ కు అలాగే వయసులోకి వచ్చిన పిల్లలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అని కరణ్ జోహార్ వారిని అడిగారు ఇక గౌరీ.. తన ఫ్యామిలీ గురించి చెబుతూ అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న డేటింగ్ గురించి కూడా ఆమె విభిన్నంగా స్పందించడం విశేషం. ఒకేసారి ఇద్దరు ముగ్గురితో డేటింగ్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదని కూడా ఆమె అన్నారు.

ఒకవేళ తన కూతురు డేటింగ్ చేసే ఆలోచనలో ఉంటే కనుక నేను చెప్పేది ఒకే ఒక్క విషయం. ఒకేసారి ఇద్దరి వ్యక్తులతో బంధం కొనసాగించడం అనేది చాలా తప్పు అని ఒకరితోనే డేటింగ్ చేయాలి అని నా కూతురికి నేను సలహా ఇస్తాను అని చాలా సింపుల్గా సమాధానం ఇచ్చింది. ఇక తన కెరీర్ తో పాటు జీవితానికి సంబంధించిన చాలా విషయాలు సొంతంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలోనే సారా కొనసాగుతున్నట్లుగా ఆమె ధీమా వ్యక్తం చేసింది.