Oke Oka Jeevitham Collections: శర్వానంద్ రికార్డు.. 9 రోజుల్లో అన్ని కోట్లు ఉఫ్.. RRR లిస్టులో చోటు

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ యంగ్ హీరో.. కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, కొంత కాలంగా శర్వాకు సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. దీంతో అతడు ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టాలన్న ఉద్దేశంతో ‘ఒకే ఒక జీవితం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను దాటేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ‘ఒకే ఒక జీవితం’ 9 రోజుల రిపోర్టును మీరే చూడండి!

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన టైం ట్రావెల్ మూవీనే ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. దీన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య అతడికి హిట్లు కూడా లేవు. దీంతో ‘ఒకే ఒక జీవితం’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగింది.

‘ఒకే ఒక జీవితం’ మూవీకి 9 రోజు వసూళ్లు డబుల్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 29 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలైంది.

బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’కు 9 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 61 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి రూ. 5.35 కోట్లు షేర్, రూ. 8.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

ఏపీ, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 5.35 కోట్లు వసూలు చేసిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 44 లక్షలు తమిళ వెర్షన్‌కు రూ. 1.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.29 కోట్లు షేర్‌, రూ. 19.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.29 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29 లక్షలు లాభాలు కూడా వచ్చాయి.

శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ 9 రోజుల్లోనే టార్గెట్‌ను పూర్తి చేసి హిట్‌గా నిలిచింది. దీంతో 2022లో ‘బంగార్రాజు’, ‘డీజే టిల్లు’, ‘RRR’, ‘డాన్’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’, ‘మేజర్’, ‘విక్రమ్’, ‘విక్రాంత్ రోణ’, ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత హిట్ అయిన 13వ సినిమా నిలిచింది. తెలుగులో మాత్రం 7వ మూవీగా ఉంది.