Mutual Fund: ఐడీఎఫ్‌సీ నిఫ్టీ వోలటాలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ NFO..

         For Quick Alerts  

Subscribe Now          

  

For Quick Alerts  

ALLOW NOTIFICATIONS          

|                                                                                       Published: Sunday, September 18, 2022,  9:22 [IST]                                     

స్టాక్ మార్కెట్ అంటే అస్థిరత తప్పకుండా కుండా ఉంటుంది. అయితే అస్థిరత ఉన్నా కొన్ని కంపెనీలు మంచి రాబడిని ఇస్తాయి. ఇలాంటి స్టాక్ ల్లో హెచ్చు తగ్గులు తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కంపెనీలను గుర్తించడం చాలా కష్టం. ఇలాంటి కంపెనీలను గుర్తించాలంటే మనకు స్టాక్ మార్కెట్ పై కచ్చితమైన అవగాహన ఉండాలి.

ఇండెక్స్ ఫండ్లు   

ఇండెక్స్ ఫండ్లు

అయితే మామూలు పెట్టుబడిదారులు మంటి స్టాక్ లను గుర్తించి పెట్టుబడి పెట్టడం కష్టం. ఇలాంటి వారు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యం కొత్త మ్యూచువల్ ఫండ్లలో పెట్టేవారు ఇండెక్స్ ఫండ్లను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే ఇండెక్స్ ఫండ్లలో కూడా ఆటుపోట్లు ఉంటాయి. ఎన్ఎఫ్ఓ గడవు

ఎన్ఎఫ్ఓ గడవు

హెచ్చుతగ్గులు కొంచెం తక్కువగా ఉండే ఇండెక్స్ ఫండ్లు మంచివి. తక్కువ ఆటుపోట్లు తక్కువగా ఉన్నఇండెక్స్ ఫండ్ ను ఐడీఎఫ్ సీ మ్యూచువల్ తీసుకొస్తోంది. ఐడీఎఫ్ సీ నిఫ్టీ 100 లో హెచ్చుతగ్గులు తక్కువగా ఉన్న ఐడీఎఫ్‌సీ నిఫ్టీ తక్కువ వోలటాలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ ఎన్ఎఫ్ఓ తీసుకొచ్చింది. ఈ ఎన్ఎఫ్ఓ గడవు ఈ నెల 23తో ముగియనుంది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక

ఈ ఫండ్ పెట్టుబడుల జాబితాలో ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ తరగతికి చెందిన షేర్లు ఉంటాయని ఫండ్ తెలిపింది. నిఫ్టీ 100 సూచీలో ప్రస్తుతం నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌కు ఎక్కువ వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన కంపెనీలు అధికంగా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌

ఐడీఎఫ్ సీ ఇండెక్స్ ఫండ్ తోపాటు ఐసీఐసీఐ కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ తీసుకొచ్చింది. దీని గడవు ఈ నెల 28 వరకు ఉంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.5వేలు గా నిర్ణయించారు. పదేళ్ల కాలంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌తో పోలిస్తే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ ఇండెక్స్‌ అధిక రాబడిని ఇచ్చింది.

Note: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.

          English summary

IDFC Mutual Fund has launched the IDFC Nifty100 Low Volatility 30 Index Fund NFO

IDFC Mutual Fund has launched the IDFC Nifty100 Low Volatility 30 Index Fund.

Story first published: Sunday, September 18, 2022, 9:22 [IST]