Life of Muthu Review శింబు వన్ మ్యాన్ షో… గౌతమ్ మీనన్ టేకింగ్ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: శింబు, సిద్ది ఇద్నానీ, రాధికా శరత్ కుమార్, సిద్దిఖ్ తదితరులు
కథ: బీ జయమోహన్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాత: ఇషారీ కే గణేష్
సినిమాటోగ్రఫి: సిద్దార్థ నూని
ఎడిటింగ్: ఆంథోని
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
బ్యానర్ం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
రిలీజ్ డేట్: 2022-09-17

నిడుదవోలుకు చెందిన ముత్తు (శింబు) ఉద్యోగ నిమిత్తం తన మేనమామతో ముంబైకి వెళ్లాలని అనుకొంటాడు. కానీ ముంబైకి వెళ్లడానికి ఒకరోజు ముందు మేనమామ సూసైడ్ చేసుకొంటాడు. అలాంటి పరిస్థితుల్లో ముంబైకి చేరుకొని పరాటాలు చేసే హోటల్‌‌లో ఉద్యోగానికి కుదురుతాడు. అయితే హోటల్ ఓనర్‌కు మలయాళీలకు ముంబై ఆధిపత్య పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలో ముంబైలో డాన్‌ కర్జికు కుడిభుజంగా ముత్తు చేరుతాడు. ముంబై మాఫియా సామ్రాజ్యంలోకి కూరుకుపోతున్న సమయంలో పావని (సిద్దు ఇద్నానీ)తో ప్రేమలో పడుతాడు.

ముంబై మాఫియాకు సంబంధించిన రెండు వర్గాల పోరులో శింబుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కర్జి, కుట్టుభాయ్ మధ్య జరిగే ఆధిపత్య పోరులో ముత్తుకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు. పావనితో ప్రేమ ఎంత వరకు వచ్చింది? వర్గపోరులో తన బాస్ కర్జి ఎలా మరణించాడు. బాస్ మరణం తర్వాత ముత్తు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కథ.

లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా విషయానికి వస్తే.. ముత్తు అనే సాధారణ వ్యక్తి జీవితం మాఫియా డాన్‌గా స్థాయికి వెళ్లిందనే పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ. తొలి భాగం విపరీతమైన సాగదీతతో బాగా బోర్ కొట్టిస్తుంది. పరాటా హోటల్ ఎపిసోడ్ సినిమాకు పెద్ద మైనస్. ఫస్టాఫ్‌లో కనీసం 30 నిమిషాలు సినిమా ట్రిమ్ చేస్తే బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి రెండో భాగం కథ మొదలైన తర్వాత అనూహ్యమైన మలుపులు, ఇంట్రెస్టింగ్ అంశాలు ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగిస్తాయి. చివరి 30 నిమిషాలు సినిమా కొత్తగా, ఎమోషనల్‌గా, నటీనటులు పెర్ఫార్మెన్స్‌‌కు పరాకాష్టగా ఉంటుంది.

దర్శకుడు గౌతమ్ మీనన్ తన సహజశైలికి భిన్నంగా కొత్త జోనర్ అటెంప్ట్ చేశాడు. కొత్త నటీనటులతో నటనను రాబట్టుకొన్న విధానం ఆకట్టుకొంటుంది. శింబును విభిన్నంగా చూపించిన విధానం బాగుంది. ఫస్టాప్‌ను చేజార్చుకొన్న గౌతమ్.. సెకండాఫ్‌పై పట్టు సాధించి చాలా బాగా డీల్ చేశాడు. ఫస్టాఫ్‌ను బాగా డీల్ చేసి ఉంటే.. ఈ సినిమా గాంగ్ స్టర్ సినిమాల్లో మాస్టర్ పీస్ అయి ఉండేదనిపిస్తుంది.

లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాలో శింబు నటన స్పెషల్ ఎట్రాక్షన్. తన కెరీర్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో శింబు ఒదిగిపోయాడు. డెఫినెట్‌గా కొత్త శింబును చూస్తాం. ఇక సిద్ది ఇద్నానీకి కూడా మంచి పాత్ర లభించింది. సెకండాఫ్‌లో నటనతో ఆకట్టుకొన్నది. మిగితా పాత్రలు కథకు తగినట్టుగా రాణించారు.

లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫి హైలెట్. పాటలు పెద్దగా ఆకట్టుకొనేలా లేవు కానీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రెహ్మాన్ అదరగొట్టాడు. ప్రతీ సన్నివేశానికి రెహ్మాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. సినిమా కోసం ఉపయోగించిన కలర్ ప్యాలెట్ బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు మైనస్. నిడివి ఎక్కువ కావడం సినిమా ఫ్లో, ఎమోషన్స్‌ను దెబ్బతీసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

లవ్, యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం లైఫ్ ఆఫ్ ముత్తు. శింబు వన్ మ్యాన్ షో, గౌతమ్ టేకింగ్, రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకు పాజిటివ్ అంశాలు, సినిమా నిడివి, సాగదీత, ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేకపోవడం మైనస్. శింబు యాక్టింగ్, గౌతమ్ మీనన్ టేకింగ్, థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు.