Janvhi kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ రచ్చ.. చూపు తిప్పుకోవడం కష్టమే!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బాక్సాఫీస్ హిట్ రాకపోయినప్పటికీ కూడా విభిన్నమైన సినిమాలతో తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా గ్లామరస్ ఫొటోస్ తో కూడా కుర్రాళ్ళ ఫోకస్ తనపై పడేలా చూసుకుంటుంది. రీసెంట్ గా మరోసారి ఒక మినీ డ్రెస్ లో ఆమె ఊహించిన విధంగా దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

గ్లామరస్ బ్యూటీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పరవాలేదు అనే విధంగా సినిమాలు చేస్తున్న జాన్వి కపూర్ ఇప్పటివరకు సరైన బాక్సాఫీస్ సక్సెస్ చూడకపోయినప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటుంది. ఒక విధంగా ఆమెకు తండ్రి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా సొంతంగానే అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. కానీ ఆమెకు ఎక్కువగా కరణ్ జోహార్ సపోర్ట్ తోనే నుంచి ఆఫర్లు వస్తున్నాయని టాక్ వస్తోంది.

జాన్వీ కపూర్ కు గతంలోనే చాలా రకాల టాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మొదట్లో తెలుగు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించింది లేదు. కానీ చాలా కాలం తర్వాత మాత్రం విజయ్ దేవరకొండ లాంటి హీరోతో నటించాలని ఉంది అని తెలియజేసింది. అతనితో ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను అంటూ మంచి టాలెంటెడ్ నటుడు అని కూడా పలు ఇంటర్వ్యూలలో తన ఇష్టాన్ని తెలియజేసింది.

ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఆ తర్వాత కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసింది కానీ అందులో కొన్ని డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలయ్యాయి. మరికొన్ని ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉన్నాయి. ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని బిగ్ బడ్జెట్ సినిమాలలో కూడా ఆఫర్లు అందుకోవాలని ఈ బ్యూటీ హార్డ్ వర్క్ అయితే చేస్తోంది.

జాన్వి కపూర్ గత ఏడాది రూహి అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపును అందుకున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద అది పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలో నటించిగా.. ఆ సినిమాను థియేటర్లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ మార్కెట్ లేకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల చేయాల్సి వచ్చింది.

ఇక సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కూడా జాన్వికపూర్ తన గ్లామర్ షో తో మాత్రం ఎప్పటికప్పుడు జనాలను ఆకట్టుకుంటూనే ఉంది. రీసెంట్ గా ఈ బ్యూటీ మరోసారి తన స్టైలిష్ అందాలతో అట్రాక్ట్ చేసింది. పొట్టి డ్రెస్ లో అమ్మడు ఎలా కనిపించినా కూడా అందమే అనే విధంగా స్టిల్ ఇచ్చింది మినీ స్కట్ లో గతంలో చాలాసార్లు కనిపించినప్పటికీ కూడా ఈసారి మాత్రం మరింత బ్యూటిఫుల్ గా ఉంది అంటూ నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక జూనియర్ శ్రీదేవి భవిష్యత్తు సినిమాలకు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో త్వరలోనే మిలి అనే ఒక సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. అలాగే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరొక రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు టాక్.