Intinti Gruhalakshmi Weekly Roundup: తులసిని పెళ్లి చేసుకుంటానన్న సామ్రాట్.. హనీ ప్రాణాలకు ముప్పు

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో చాలా రకాల సీరియళ్లు వస్తున్నాయి. అయితే, అందులో సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటే సీరియళ్లు తక్కువగానే ఉంటున్నాయి. అందులోనూ కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఒకటి. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని అంతకంతకూ పెంచేస్తోంది. ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఎలా సాగిందో మీరే చూడండి!

12వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. పూజ జరుగుతోన్న సమయంలో లాస్య.. హనీని మీ డాడీ రాలేదా అని అడుగుతుంది. దీంతో ఆయన కారులో ఉన్నారని చెప్తుంది. అప్పుడు ఈ విషయాన్ని సామ్రాట్ బాబాయి అడిగి తెలుసుకున్న తులసి.. వెంటనే కారు దగ్గరకు వెళ్లి అతడిని లోపలికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు అందరూ ఆయనను లోపలికి ఆహ్వానిస్తారు. కానీ, అభి మాత్రం తులసికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తాడు. దీంతో సామ్రాట్ వెళ్లిపోతానని అంటాడు. కానీ, తులసి పట్టుబట్టి తీసుకొచ్చి సామ్రాట్‌ను పూజలో కూర్చోబెడుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Today Episode: తులసి.. సామ్రాట్ మధ్య ఊహించని సీన్.. లాస్య వల్లే జరిగిందంటూ!

13వ తేదీ మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గణపతి పూజ కోసం ఇంటికి వచ్చిన సామ్రాట్‌తో కలిసిపోమని తులసిని ఇంట్లో వాళ్లు అందరూ అడుగుతారు. అదే సమయంలో అతడికి నిజం చెప్పమని అంటారు. దీంతో తులసి అలా చేస్తే నందూను అందరి ముందే అవమానించినట్లు అవుతుందని అంటుంది. ఆ తర్వాత తులసి.. లక్కీ, హనీకి పులిహోర తినిపిస్తుంది. మధ్యలో అభి గొడవ చేయబోగా.. అతడిని అంకిత తీసుకెళ్తుంది. అనంతరం అందరూ సాయంత్రం ఎంజాయ్ చేద్దామని దివ్య.. సామ్రాట్‌ను ఉండమని అడుగుతుంది. ఆ తర్వాత చిటీల గేమ్‌ ప్రారంభిస్తారు.

14వ తేదీ బుధవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. గణపతి పూజ కోసం ఇంటికి వచ్చిన అతిథులతో కలిసి తులసి కుటుంబ సభ్యులు చీటీల ఆట ఆడతారు. అందులో ముందుగా ప్రేమ్, శృతి నిజంగానే గొడవ పెట్టుకుని టాస్కు కోసం నటించామని అబద్దం చెప్తారు. ఆ తర్వాత నందూ, లాస్య ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. అంతేకాదు, ఆమెను పైకి లేపి తిప్పుతాడు. అనంతరం తులసి ఓ పాట పాడుతుంది. ఇక, చివర్లో సామ్రాట్ మాత్రం నందూ, తులసి మధ్య జరిగిన ఒప్పందాన్ని కథలా చెప్తాడు. దీంతో నందూ, లాస్య కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత సామ్రాట్ కూడా వెళ్లిపోతాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Today Episode: నిజం చెప్పి షాకిచ్చిన సామ్రాట్.. కాళ్లు పట్టుకోమని అనడంతో!

15వ తేదీ గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. నందూకు ముఖం చూపించలేనని నందూ బాధ పడుతూ ఉంటాడు. దీంతో లాస్య అతడిని ఓదార్చి సామ్రాట్‌తో మాట్లాడతానని వెళ్తుంది. సామ్రాట్ ఆహ్వానం మేరకు తులసి అతడి ఆఫీస్‌కు వెళ్తుంది. దీంతో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో లాస్య అక్కడకు వస్తుంది. అయితే, అప్పుడామెను పక్కన వెయిట్ చేయమని సామ్రాట్ వెనక్కి పంపించేస్తాడు. తులసి కోరిక మేరకు నందూ వాళ్లకు సామ్రాట్ మళ్లీ జాబ్ ఇస్తాడు. ఈ విషయాన్ని లాస్యకు చెప్తాడు. చివర్లో తన జోలికి రావొద్దని తులసి లాస్యను హెచ్చరిస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు షాకిచ్చిన సామ్రాట్.. నందూ కోసం తులసి ఊహించని నిర్ణయం

16వ తేదీ శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌తో మాట్లాడడానికి వచ్చిన లాస్యకు తులసి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మాత్రం నందూకు తులసి సహాయాన్ని చెప్పకుండా అబద్ధాలు చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో కలిసి తులసి బయటకు వెళ్దామని అంటుంది. ఇక, తులసి కోసం కడుతున్న మ్యూజిక్ స్కూల్ దగ్గరకు నందూ, లాస్య వస్తారు. ఆ తర్వాత సామ్రాట్, తులసి ఒకే కారులో వస్తారు. వాళ్లను చూసి నందూకు కోపం పెరుగుతుంది. అనంతరం ఖర్చు గురించి మాట్లాడిన లాస్యకు తులసి ఓ రేంజ్‌లో క్లాస్ తీసుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Today Episode: నందూకు వాళ్ల నుంచి గుడ్ న్యూస్.. అంతలోనే తులసిని చూసి షాక్

17వ తేదీ శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆఫీసులో తులసి గురించి నందూకు సామ్రాట్ క్లాస్ పీకుతాడు. ఆమెను వదులుకొని చాలా తప్పు చేశావని అంటాడు. ఆ తర్వాత నందూ ఫుల్లుగా మందు తాగి కోపంగా వస్తూ ఉంటాడు. అప్పుడే అతడి కారు ఆగిపోతుంది. ఆ తర్వాత మెకానిక్ రాగానే సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేయమని అడుగుతాడు. కానీ, అతడు ఒప్పుకోడు. దీంతో నందూనే వెళ్లి సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేస్తాడు. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే సామ్రాట్, తులసి ఆ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. కానీ, అది నందూ కన్న కల కావడంతో అతడు గట్టిగా అరుస్తాడు. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ ప్రపోజ్.. అంతలోనే ప్రమాదం.. చివర్లో ట్విస్ట్

సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 17వ వరకు సాగిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. ఈ వారంలో తులసి వల్ల నందూ, లాస్యలు సామ్రాట్ కంపెనీలో ఉద్యోగాలను తిరిగి పొందుతారు. కానీ, ఆ సమయంలో సామ్రాట్ చెప్పిన మాటలకు నందూ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. దీంతో బాస్‌నే చంపాలని కారుకు బ్రేకులు తీస్తాడు. కానీ, సామ్రాట్ ఆ కారులో హనీతో వెళ్లినట్లు, వాళ్లకు యాక్సిడెంట్ అయినట్లు చూపించారు. అయితే, అది నిజంగానే నిజమో లేక మరో కలో తెలియాల్సి ఉంది. మొత్తానికి వచ్చే వారం కూడా సస్పెన్స్‌గా సాగనుంది.