Bigg Boss Telugu 6: షాని సాల్మన్ అరుదైన ఫీట్.. షో చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో ఆడియెన్స్ దీనికి ఫిదా అయ్యారు. ఫలితంగా తెలుగులో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ ఆరో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో మొదటి ఎలిమినేషన్‌లో షాని సాల్మన్ ఎలిమినేట్ అయ్యాడు. తద్వారా ఓ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

దేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా తెలుగులో మాత్రమే బిగ్ బాస్ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను కంప్లీట్ చేసింది. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌ను అందుకుని రేటింగ్‌తో రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఇది నెంబర్ వన్ షోగా మారింది.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా దానిపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఆరో సీజన్‌పైనా అదే రీతిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు ఈ సారి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనాలు మెచ్చే అంశాలపై ఫోకస్ చేసి వాటినే ప్రసారం చేస్తున్నారు. కానీ, రేటింగ్‌ను మాత్రం రాబట్టడం లేదు.

బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి అడుగు పెట్టారు.

బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

ఆరో సీజన్‌లో మొదటి వారం ఎలిమినేషన్‌ను తీసేసి సరికొత్త ప్రయోగం చేశారు. ఈ క్రమంలోనే రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా గొడవలతో సాగింది. ఇందులో రేవంత్, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ నామినేట్ అయ్యారు. చివర్లో కెప్టెన్ బాలాదిత్య బిగ్ బాస్ చెప్పడంతో రాజశేఖర్, షానీ సాల్మన్‌ను నేరుగా నామినేట్ చేశాడు.

గత శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఇంట్లోని కంటెసెంట్లు అందరి మీద విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే సరిగా ఆడని 9 మందిని సెలెక్ట్ చేసి.. వాళ్లలో ఎవరు వేస్ట్ కంటెస్టెంట్ చెప్పమని మిగిలిన వాళ్లకు చెప్పాడు. వాళ్లలో ముగ్గురికి మూడు ఓట్లు వచ్చాయి. అందులో నుంచి ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా షాని సాల్మన్‌ను ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ చేశారు.

Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్‌గా షాని సాల్మన్ నిలిచాడు. అయితే, అతడిని మాత్రం ఏమాత్రం మర్యాద ఇవ్వకుండానే షో నుంచి బయటకు పంపేశారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ ఎలిమినేషన్‌లో ఓ మేల్ కంటెస్టెంట్ ఉండడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో నాలుగో సీజన్‌లో సూర్య కిరణ్ ఫస్ట్ వీక్ వెళ్లిపోయాడు.

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటి సీజన్‌లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన, మూడో సీజన్‌లో హేమ, నాలుగో సీజన్‌లో సూర్య కిరణ్, ఇప్పుడు ఐదో సీజన్‌లో సరయు రాయ్.. నాన్ స్టాప్ సీజన్‌లో ముమైత్ ఖాన్‌లు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయారు. ఇందులో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. అయితే, ఇప్పుడు షానీ వెళ్లడంతో ఈ తేడాలో కాస్త మార్పులు వచ్చాయి.