Bigg Boss Telugu 6: శ్రీహన్ దుప్పట్లో ముగ్గురు అబ్బాయిలు.. తెల్లారేసరికి అలా ఉంటుంది అంటూ..

బిగ్ బాస్ 6వ సీజన్ రెండవ వారం ఎలిమినేషన్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక శనివారం రోజు షానీ సాల్మన్ హౌస్ లో నుంచి వెళ్లిపోయాడు. ఇక ఆదివారం రోజు నాగర్జున మరొకరిని హౌస్ లో నుంచి బయటకు పంపించేందుకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ఈరోజు తమన్నా బబ్లీ సినిమా బౌన్సర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రత్యేకంగా హౌస్ లోకి అతిథిగా అడుగుపెట్టారు. ఇక ఆమెను ఇంప్రెస్ చేసేందుకు కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటీపడ్డారు.. ఇక కొద్దిసేపటి క్రితం విడుదలైన ప్రోమో వివరాల్లోకి వెళితే..

అక్కినేని నాగార్జున అక్కినేని సాంగ్ తో సరికొత్తగా అమ్మాయిలతో డాన్స్ చేస్తూ స్టేజిపై కనిపించారు. ఇక తర్వాత తమన్నా హౌస్ లోకి రాగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి టాలెంట్ ను బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఆర్జే సూర్య అయితే అల్లు అర్జున్ డైలాగ్ తో చాలా బాగా మెప్పించాడు. అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ స్టెప్పులు వేశారు.

ఇక నాగార్జున, తమన్నాను పసిబిడ్డలను చూస్తే ఏం చేస్తావ్ అని అడగడంతో ఆమె ముద్దు పెడతాను అని చెప్పింది. కానీ మా గీతూ అయితే ఏం చేస్తుందో తెలుసా అంటూ నవ్వుకున్నారు. ఎందుకంటే గీత చిన్న పిల్లలను కనిపిస్తే గిల్లేస్తాను అంటూ గతంలో కామెంట్ చేసింది. ఇక బిగ్ బాస్ లోని అబ్బాయిలు ఎవరైనా సరే ఒక అమ్మాయిని బౌన్సర్ గా సెలెక్ట్ చేసుకోవాలి అని అబ్బాయిలకు చెప్పడం జరిగింది.

దీనితో మొదట బాలాదిత్యా గీతును సెలెక్ట్ చేసుకుంటూ నేను బిగ్ బాస్ కు భయపడతాను కాబట్టి అతని నుంచి ఆమెని నన్ను కాపాడుతుంది అని అంటాడు. దీంతో నాగార్జున కూడా తెలివితేటలు బాగా పెరిగిపోయాయి అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈమధ్య నాకు ఉదయం లేచి చూసేసరికి మెడ దగ్గర ఏదో మార్క్ ఉంటుంది అని శ్రీహాన్ చెప్పాడు. అయితే పక్క బెడ్ లోకి అర్జున్ వచ్చినప్పటి నుంచే మార్క్ ఉంటుంది అని చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఒక్క దుప్పట్లోనే ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అంటూ ఆరోహి కూడా కౌంటర్ ఇచ్చింది.

ఇక సూర్య, ఆరోహినీ సెలెక్ట్ చేసుకోవడంతో ఈ స్పందనకు అర్థమేంటి అంటూ నాగార్జున మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. ఇక మా మధ్య ఏమి లేదు అంటూ.. మూడు సంవత్సరాల నుంచి పుట్టనిధి ఇప్పుడు ఏలా పుడుతుంది అని ఆరోహి చెబుతుంది. ఇక నాగార్జున ఇప్పుడు మేము ఏమైనా అడిగామా అని అన్నాడు. ఇక మరోవైపు అభినయ అయితే వీరిద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని కామెంట్ చేసింది.

One more elimination today… Who will say goodbye to #BiggBossTelugu6? 👀

Watch the drama unfold, tonight at 9 PM on StarMaa & DisneyPlusHSTel.#BiggBossTelugu #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/wf1Pl8QKpP

ఇక ఆర్జే సూర్య మరోసారి పవన్ కళ్యాణ్ వాయిస్ మిమిక్రి చేసి తమన్నాను మెప్పించాడు. అందుకు తమన్నా కూడా పర్ఫెక్ట్ అని చెప్పింది. ఇక మొత్తంగా నామినేషన్ లో ఇప్పుడు ఏడుగురు ఉన్నారు అంటూ నాగార్జున సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఇక ముందుగానే అయితే అభినయశ్రీ వెళ్ళిపోతుంది అని ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈరోజు ఏం జరుగుతుందో పూర్తి ఎపిసోడ్ లో చూడాలి.