Bigg Boss Telugu 6: బిగ్ బాస్ కు మండుతున్నట్లుంది, నాగార్జునతో అగ్గి రాజేసి.. పెద్ద ప్లానే!

బిగ్ బాస్ షో 6వ సీజన్ మొదలైన తర్వాత చాలా గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది అని నిర్వాహకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత రెండు మూడు సీజన్స్ లో కంటే ఈసారి విభిన్నమైన టాస్కులతో ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈసారి మొదటి ఎపిసోడ్ కు ఊహించని విధంగా రేటింగ్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రస్తుతం రేటింగ్ అయితే చాలా దారుణంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ తప్పని పరిస్థితుల్లో మరొక పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. ఒక విధంగా బిగ్ బాస్ కు ఇప్పుడు మండుతోంది అని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే..

బిగ్ బాస్ షో మొదటి సీజన్ నుంచి చూసుకుంటే దాదాపు 5వ సీజన్ వరకు కూడా షో బాగానే కొనసాగింది. ఆఖరికి నాన్ స్టాప్ షో కూడా పరవాలేదు అనే విధంగా ఆకట్టుకుంది. ఒక విధంగా అందులో ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా పేరున్న సెలబ్రెటీలు కాకపోయినా కూడా ఓవర్గం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పెంచుకుంటున్నారు. అయితే ఈసారి మాత్రం 6వ సీజన్ విషయంలో నిర్వాహకుల అంచనాలు ఒక్కసారిగా తలక్రిందలయ్యాయి.

సాధారణంగా బిగ్ బాస్ షోకు నార్మల్ డేస్ లో రావాల్సిన రేటింగ్.. ప్రారంభ ఎపిసోడ్ కు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు అంత తక్కువ స్థాయిలో రేటింగ్స్ నమోదవుతాయని ఒక విధంగా ఎవరు ఊహించలేదు. అయితే బిగ్ బాస్ కు ఈ తరహా రేటింగ్ చూసిన తర్వాత మండుతున్నట్లు ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందుకే నాగార్జున ద్వారా ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా అభిప్రాయాలు వస్తున్నాయి.

ఈసారి బిగ్ బాస్ షో వేసిన ప్లాన్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. గతంలో పెద్దగా ఆడియన్స్ లో గుర్తింపు లేనటువంటి సెలబ్రిటీలను కూడా తీసుకువచ్చారు. ఒక విధంగా అప్పుడు హౌస్ లో ఉన్న వాతావరణం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈసారి రెండు వారాలైనా కూడా అసలు హౌస్ లో ఉన్న ఏ ఒక్క సెలబ్రిటీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

ఒక విధంగా బిగ్ బాస్ షోలో ఎన్ని గొడవలు జరిగితేనే ఆ స్థాయిలో క్రేజ్ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా హౌస్ మీట్స్ స్నేహంగా ఉండి ఆటలు పాటలు పాడుకుంటూ ఉంటే మాత్రం ఏ ఒక్కరు కూడా షోను పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా నాగర్జున సండే ఫన్డే అనే ఎంటర్టైన్మెంట్ టాస్క్ మరో పెద్ద ఫ్లాప్ గా నిలుస్తోంది. కంటెస్టెంట్స్ ఆ విషయంలో పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

ఇక ఇటీవల నాగార్జునతో బిగ్ బాస్ నిర్వాహకులు అందరూ కూడా చర్చలు జరిపి మళ్లీ షో రేటింగ్స్ పెంచాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. షో ప్రారంభ ఎపిసోడ్ కు గతంలో ఎప్పుడూ లేనంత అది తక్కువ రేటింగ్ రావడం నిర్వాహకులకు ఒక్కసారిగా చెమటలు పట్టించింది. ఇలానే కొనసాగితే షో మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఏర్పడుతుంది అని అందుకే నాగార్జునతో నిర్వాకులు సీరియస్ గా చర్చలు జరిపి షో రేటింగ్ పెంచాలని ఫిక్స్ అయ్యారట.

అందుకే నాగర్జున శనివారం రోజు చాలా సీరియస్ అయ్యారు. మరి ఈ తరహా అగ్రేషన్ ప్లాన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.