Bigg Boss Telugu 6: ఎలిమినేషన్‌తో షాకింగ్ ట్విస్ట్.. శనివారం షాని ఔట్.. ఆదివారం ఎవరంటే!

కాన్సెప్టు కొత్తగానే ఉన్నా.. రికార్డుల మీద రికార్డులు కొట్టేంత ఆదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. కంటెంట్ ఎలాంటిదైనా ప్రేక్షకుల మద్దతు దొరికిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీనికి ఉదాహరణే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంటే అయినా తెలుగు ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందివ్వడంతో దేశంలో చాలా భాషల్లో వస్తున్నా.. మన దగ్గర మాత్రమే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది.

ఇప్పుడు ఆరో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, రెండో వారంలో బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్‌తో షాకిచ్చాడు. ఇందులో శనివారం షాని ఎలిమినేట్ అయ్యాడు. మరి ఆదివారం ఎవరు వెళ్తారన్నది లీకైంది. ఆ వివరాలు మీకోసం!

చాలా భాషల్లో ముందే పరిచయం అయినా.. బిగ్ బాస్ షో తెలుగులోకి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌లను రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌లతో పూర్తి చేసుకుంది.

బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

ఇంతకు ముందు వచ్చిన సీజన్లు అన్నీ భారీ ఆదరణను అందుకోవడంతో ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌లో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే టాస్కుల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ.. ప్రేక్షకులు మెచ్చే అంశాలను చూపిస్తున్నారు. ఇలా ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

ఆరో సీజన్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా గొడవలతో సాగింది. ఇందులో ఆరుగురు సభ్యులు రేవంత్, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్ నామినేట్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ కెప్టెన్ బాలాదిత్యను మరో ఇద్దరినీ నామినేట్ చేయమని చెప్పగా.. అతడు రాజశేఖర్, షానీ సాల్మన్‌ను నేరుగా నామినేట్ చేశాడు.

బిగ్ బాస్ షోలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం సాధ్యం కాని పని. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్ సరికొత్త పరిణామాలతో సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి వారం నామినేషన్ తీసేశారు. కానీ, రెండో వారంలో మాత్రం డబుల్ ఎలిమినేషన్ అంటూ షాకిచ్చారు. ఈ విషయాన్ని నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో స్వయంగా వెల్లడించాడు.

Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఇంట్లోని కంటెసెంట్లు అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సరిగా ఆడని 9 మందిని సెలెక్ట్ చేసి.. వాళ్లలో ఎవరు వేస్ట్ కంటెస్టెంట్ చెప్పమని మిగిలిన వాళ్లకు చెప్పాడు. వాళ్లలో ముగ్గురికి మూడు ఓట్లు వచ్చాయి. అందులో నుంచి ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా షాని సాల్మన్‌ను శనివారం ఎలిమినేట్ చేసేశారు.

రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పిన నాగార్జున.. ఎవరినీ సేఫ్ అయినట్లు ప్రకటించలేదు. దీంతో ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు వెళ్లిపోతారని అంతా చర్చించుకుంటున్నారు. అయితే, బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈరోజు ఎపిసోడ్‌లో అభినయశ్రీ ఎలిమినేట్ అవుతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తైపోయింది.