Bigg Boss: నాగార్జున – అమలపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. పబ్లిక్‌గా ఆ పని చేస్తారా అంటూ!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో అన్నింటికీ ప్రేక్షకుల మద్దతు లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యే షోను అసలు మన వాళ్లు ఆదరిస్తారా అంటే.. అవును ఆదరిస్తారు. దీనికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోనే ప్రత్యేకమైన ఉదాహరణ. ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను భారీ టీఆర్పీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్‌ను నిర్వహకులు మొదలు పెట్టారు. దీనిపై, హోస్ట్ నాగార్జున, అమలపై తాజాగా ప్రముఖ నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే బిగ్ బాస్ షో నెంబర్ వన్ ప్లేస్‌కు ఎగబాకింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసకుంటూ వస్తున్నారు. ఇది ఎంతలా సక్సెస్ అయిందో.. అదే రీతిలో విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. దీనిపై చాలా మంది ప్రముఖులతో పాటు కొందరు సామాన్యులు సైతం ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఎన్నో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

బిగ్ బాస్ షో జరుగుతున్న తీరును తప్పుబడుతూ చాలా మంది ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. అందులో సీపీఐ పార్టీ నారాయణ ఒకరు. చాలా కాలంగా ఈయన ఈ రియాలిటీ షోను నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాదు, నాగార్జునపైనా నారాయణ విరుచుకుపడ్డారు.

సీపీఐ పార్టీ నారాయణ చేసే వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎంతో మంది ఎదురుదాడికి దిగుతుండగా.. కొందరు సినీ ప్రముఖులు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. అందులో ప్రముఖ నిర్మాత చిట్టిబాబు ఒకరు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నారాయణకు మద్దతు తెలిపి బిగ్ బాస్‌పై విమర్శలు చేశారు.

బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

చిట్టిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘నారాయణ వాడిన భాష తప్పగా ఉండొచ్చేమో కానీ.. భావం మాత్రం కరక్టే. బూతు అంటే విప్పి చూపించడమే కాదు.. పబ్లిక్ రొమాన్స్ చేయడం కూడా బూతే. నాలుగు గోడల మధ్య జరిగే రొమాన్స్‌ను పబ్లిక్‌గా చూపిస్తానంటే అది బూతే అవుతుంది. బిగ్ బాస్ రియల్ పర్సనాలిటీని బయటకు తీసే షో అని చెప్పలేం’ అన్నారు.

చిట్టిబాబు కంటిన్యూ చేస్తూ ‘బిగ్ బాస్ షోలో ఏం చేస్తున్నారు? ఒకే బెడ్‌‌పై ఇద్దరూ పడుకుంటున్నారు. ఎగిరెగిరి ముద్దులు పెట్టుకుంటున్నారు. కౌగిలించుకుంటున్నారు. ఇవన్నీ పబ్లిక్ రొమాన్స్ కిందకే వస్తాయి. ఫ్యామిలీతో కలిసి చూసే షోలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. పబ్లిక్ రొమాన్స్ చేయడం బుద్దిలేని పని. దాన్ని నాగార్జున లాంటి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు’ అంటూ విమర్శించారు.

బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

చిట్టిబాబు మాట్లాడుతూ.. ‘నాగార్జున అసలు ఏం ఆలోచిస్తున్నాడో కానీ, మొన్న జంటగా వెళ్లిన భార్యభర్తలను మీకు లైసెన్స్ ఉంది. కౌగించుకోండి.. ముద్దులుపెట్టుకోండి అంటున్నాడు. అంటే పెళ్లైన వాళ్లు పబ్లిక్‌గా ఏమైనా చేసేసుకోవచ్చా? ఆయన కూడా పబ్లిక్‌లో అలాగే చేస్తున్నాడా? ఆయనకి కూడా పెళ్లైంది కదా.. లైసెన్స్ ఉంది కదా.. వాళ్ల భార్యను తీసుకొచ్చి పబ్లిక్‌లో బయట రొమాన్స్ చేస్తాడా? నలుగురిలోకి వచ్చినప్పుడు ఆయన చాలా గౌరవంగానే ఉంటాడు కదా.. కానీ బిగ్ బాస్‌లో ఎందుకు రెచ్చగొడుతున్నాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిట్టిబాబు కొనసాగిస్తూ.. ‘షోలో ఇవన్నీ తగ్గించకపోతే ప్రజలు తిరగబడతారు. బూతు అంటే బట్టలిప్పడం కాదు. పబ్లిక్ రొమాన్స్ కూడా బూతే. నాలుగు గోడల మధ్య చేసేది.. బహిరంగంగా చేయడం తప్పు. బిగ్ బాస్‌లో ఖచ్చితంగా అసభ్యత ఉంది. నారాయణ కరెక్ట్‌గా అన్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇలాంటి కార్యక్రమాలను బ్యాన్ చేసినా తప్పులేదు’ అన్నారు.