Allu Arjun హీరోయిన్‌కు సారీ చెప్పిన ఐకాన్ స్టార్.. అల్లూరి ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

అందరికి నమస్కారం. మీ ఉత్సాహం చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఈ ఈవెంట్ ద్వారా నాకు ఉత్సాహాన్ని అందించిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. శ్రీవిష్ణును ఇష్టపడే వారికి, ఆయనను అభిమానించే వారికి, నేను ఎంతో ప్రేమించే నా అభిమానులకు థ్యాంక్స్. అందరికి ఫ్యాన్స్ ఉంటారు. కానీ నాకు ఆర్మీ ఉంటుంది. నాపై అభిమానాన్ని కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించిన తనికెళ్ల భరణి ప్రతీ ఒక్కరికి నా బెస్ట్ విషెస్ అని అల్లు అర్జున్ అని అల్లూరి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ..

అల్లూరి సినిమాలో నటించిన హీరోయిన్ పేరు నాకు అర్ధం కాలేదు. ఇప్పటికే మూడుసార్లు చెప్పారు. ఆమె పేరు నాకు చాలా కష్టంగా ఉంది. ఆమె పేరు పలకడానికి కష్టంగా ఉంది అని అల్లు అర్జున్ అనగానే.. పక్కనే ఉన్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్ చెవిలో హీరోయిన్ పేరు చెప్పారు. దాంతో పక్కనే ఉన్న హీరోయిన్‌తో మాట్లాడుతూ.. నీ పేరు పలకలేకపోతున్నా. అందుకు సారీ.. కాయడు లోహర్‌కు ఇది తొలిసినిమా. వెల్‌కమ్ టు టాలీవుడ్ అని అల్లు అర్జున్ అన్నాడు.

అల్లూరి సినిమాకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, ముఖ్యంగా తొలి చిత్ర దర్శకుడు ప్రదీప్ వర్మ గారికి బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి అభినందనలు. ప్రేమ, ఇష్క్ కాదల్ నుంచి హుషారు వరకు మీ సినిమాలు ఫాలో అవుతున్నాను. మీరు మంచి మంచి సినిమాలు తీసి.. తెలుగు సినిమా పరిశ్రమ ప్రతిష్టను పెంచాలి అని అల్లు అర్జున్ అన్నారు.

నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు గారు.. నేను ప్రతీ సినిమా ఫాలో అవుతున్నాను. ఆయన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్. ఆ సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటారు. కానీ చిన్న పాత్రనైనా బాగా చేశారు. అప్పటి నుంచి ఆయన సినిమాలు మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు. రాజరాజ చోర లాంటి సినిమాలు నాకు నచ్చుతాయి. ఆయన ఎంచుకొనే సినిమాలో కొత్తదనం ఉంటుంది. సినిమాకు చాలా కష్టపడుతాడు. ఆ సినిమా హిట్ కాకపోయినా నటుడగా నాకు గౌరవం పెరుగుతుంది. ఫలితాన్ని పక్కన పెడితే.. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయనకు ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. మంచి సినిమాల్లో నటించాలని శ్రీవిష్ణును కోరుకొంటున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

అల్లూరి సినిమా సెప్టెంబర్ 23వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను చూసి సపోర్టుగా నిలువాలి. శ్రీవిష్ణు అంటే నాకు సాఫ్ట్ కార్నర్. పుష్ప 2 సినిమా హడావిడిలో ఉన్నాను. ఆ సమయంలో ఫంక్షన్లకు హాజరుకావొద్దని అనుకొన్నాను. కానీ అల్లూరి సినిమా రిలీజ్ విషయంలో నా వద్దకు వచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని అడిగాడు. నేను ఎప్పుడూ సినిమాలు ప్రమోట్ చేయడు. కానీ ఈ సినిమాకు ప్రమోట్ చేయాలని అనుకొన్నాడు. ఆయన అడగ్గానే చూస్తానని చెప్పాను. కానీ నా మనసులో వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. నేను షూటింగులో ఉన్నా వచ్చే వాడిని. శ్రీవిష్ణు లాంటి వ్యక్తుల చాలా మంది నాకు నచ్చుతారు. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని శ్రీవిష్ణు కోరుకొంటున్నాను అని అల్లు అర్జున్ తెలిపారు.

టాలీవుడ్ సినిమాల గురించి పరిశ్రమలో చర్చ జరుగుతున్నది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. మరికొన్ని హిట్లు అవుతున్నాయి. పెద్ద సినిమాల వర్కువుట్ అవుతాయనేది కష్టంగా ఉంది. మంచి కంటెంట్ ఉంటే.. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు. అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. అల్లూరి సినిమా మంచి కంటెంట్ ఉన్న మూవీ. తప్పకుండా ఆదరించండి అని అల్లు అర్జున్ అన్నారు.