1213 టీ కప్పులు.. మోడీ మొహం మీద, అదుర్స్.. వీడియో వైరల్

ప్రధాని మోడీ బర్త్ డే నేడు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. ప్రముఖులు ఫోన్ చేసి.. మరీ చెప్పారు. మరీ కళాకారులు కళలతోనే చెబుతారు. ఇక సుదర్శన్ పట్నాయక్ లాంటి వారి గురించి చెప్పొద్దు. ఆయన సందర్భాన్ని బట్టి సైకత శిల్పం రూపొందిస్తారు. ఇందుకు పూరీ బీచ్ వేదిక అవుతుంది. ఇప్పుడు మరోసారి అలాంటి సైకత శిల్పం రూపొందించారు. అదేంటో మనం చుద్దాం పదండి.

ప్ర‌ధాని మోడీ బర్త్ డే సంద‌ర్భంగా దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సంద‌ర్భానికి తగినట్టు సైక‌త శిల్పంతో ఆక‌ట్టుకునే సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ కూడా ప్ర‌ధానికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అది కూడా త‌న సైక‌త శిల్పాలతో విష్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పూరీ తీరాన ఇసుక‌తో మోడీ ముఖాన్ని తీర్చిదిద్దారు. ఆ ముఖం చుట్టూ 1,213 మ‌ట్టితో త‌యారు చేసిన టీ క‌ప్పుల‌ను ఏర్పాటు చేశారు. ఓ ఫ్రేమ్ లాంటి నిర్మాణాన్ని క‌ట్టేశారు. మోడీ ముఖానికి ముందు హ్యాపీ బ‌ర్త్‌డే మోడీజీ అని కూడా రాశారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

సుదర్శన్ పట్నాయక్ సందర్భానికి తగినట్టు వ్యవహరిస్తారు. ఏ విపత్తు అయినా అతని సైకత శిల్పంతో మెప్పించాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన వేగంగా తెలిసిపోతుంది.

Wishing Our Hon’ble Prime Minister @narendramodi ji on his birthday. May Mahaprabhu Jagannath bless him with long and healthy life to serve mother India.
I’ve created a SandArt installation used 1,213 Mud Tea Cups on Sand with message #HappyBirthdayModiJi at Puri beach , Odisha pic.twitter.com/67DOCjqjzs