వైఎస్ ను కుట్ర చేసి చంపారు – నాపై కుట్ర జరుగుతోంది : షర్మిల సంచలనం..!!

వైఎస్సార్టీపీ అధినేత్రి..ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారని..తనకు కూడా చంపగలరంటూ వ్యాఖ్యానించారు. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన సమయంలో జిల్లా మంత్రి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. దీని పైన మాట్లాడిన షర్మిల..తన ఆత్మాభిమానం దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.

తనను మంత్రి మరదలు అంటే తాను పట్టించుకోకుండా ఉండాలా అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణ లో మహిళల మీద గౌరవం అంటూ నిలదీసారు. తెలంగాణ లో మంత్రుల మీద కేసులు వేయకూడదా అంటూ ఫైర్ అయ్యారు. మంత్రుల మీద కేసును నమోదు చేయమని నేరుగా చెప్పాలని డిమాండ్ చేసారు. తాను కేసు పెడితే కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ లో ప్రజా స్వామ్యమే లేదన్నారు. ఒకడు మరదలు అంటాడు…ఒకడేమో వ్రతాలు అంటాడు అంటూ ఫైర్ అయ్యారు. పోలీస్ శాఖ ను టీఆర్ఎస్ లో విలీనం చేయండని వ్యాఖ్యానించారు.

దమ్ము ఉంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ చేసారు. తనకు బేడీలు అంటే భయం లేదన్నారు. నా పేరు వైఎస్ షర్మిల..నేను వైఎస్సార్ బిడ్డను అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. గుర్తు పెట్టుకో కేసీఅర్.. నేను పులి బిడ్డను అంటూ హెచ్చరించారు. తన గొంతు నొక్కడం మీ తరం కాదంటూ టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనను ఎవరూ ఆపలేరన్నారు. మీతో పోలీస్ లు ఉంటే..నాతో జనం ఉన్నారని చెప్పుకొచ్చారు.

తాను పులి బిడ్డనని.. బేడి లకు భయపడే దానిని కాదని స్పష్టం చేసారు. కేసులు పెట్టారు..కదా అరెస్ట్ చేయండి చూద్దాం అంటూ సవాల్ చేసారు. తన పైన కుట్ర చేసి పాదయాత్ర ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. మంత్రుల అవినీతి గురించి ప్రశ్నించకూడదా అని నిలదీసారు.

తెలంగాణలో ఏ మహిళ నైనా అడగండి…మరదలు అంటే చెప్పుతో కొడతారా..లేదా అంటూ షర్మిల సీరియస్ అయ్యారు. రైతుల మీద ప్రేమ లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అంటూ మరోసారి టార్గెట్ చేసారు. స్పీకర్ పైన టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే షర్మిల సోషల్ మీడియా ద్వారా తన వాదన వినిపించారు. తన పైన తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలను అందులో ప్రస్తావించారు. దీంతో..ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. కేసుల వ్యవహారం ఇప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.