వామ్మో..ఏందిదీ, పవిత్ర స్థలంలో కొట్లాట.. కారణమిదే..?

పంజాబ్‌లో రెండు సిక్కు వర్గాలు గొడవకు దిగాయి. ఫరీద్ కోట గురుద్వారాలో శనివారం ఘర్షణకు దిగాయి. వీరి గొడవకు కారణం నాయకత్వమేనని తెలిసింది. ఇరు గ్రూపులు తీవ్ర కోపంతో ఉన్నాయి. ఆ రెండు గ్రూపులు కత్తి తీసుకొని రావడం కలకలం రేపింది.

ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గురుద్వారా ప్రెసిడెంట్ పదవీ కోసం గొడవ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో రగడ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న కమిటీ, మాజీ కమిటీ సభ్యులు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘటనను జతేదార్ శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తు చేసి.. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.