యూనివర్శిటీ విద్యార్థినుల బాత్‌రూమ్ వీడియోలు లీక్..బాయ్ ఫ్రెండ్‌తో వైరల్: రాత్రంతా..!!

చండీగఢ్: ప్రతిష్ఠాత్మక చండీగఢ్ యూనివర్శిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ విద్యార్థినుల బాత్‌రూమ్ వీడియోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థినులు స్నానం చేస్తోన్న వీడియోలు అవి. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులందరూ ఆందోళనకు దిగారు. రాత్రంతా నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు స్పందించారు. తక్షణ చర్యలకు దిగారు.

MMS of 60 girls in #Chandigarh #University leads to massive #protest by girls…

As per info, #MMS of girls were recorded from girls #hostel and leaked on the #Internet.#Police hv registered #FIR against #MBA 1st year girl student and #arrested her for further #investigation. pic.twitter.com/dlp4Z374NM

ఈ వీడియోలను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేసిన విద్యార్థినిని గుర్తించారు. అతణ్ని అరెస్ట్ చేశామని మొహాలి ఎస్ఎస్పీ వివేక్ షీల్ సోని తెలిపారు. ఈ వీడియోను తోటి విద్యార్థినే చిత్రీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ ఘటనపై ఎప్ఐఆర్ నమోదు చేశామని వివరించారు. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. విద్యాశాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ బైన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిని వదిలి పెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#WATCH | Amidst protest from Chandigarh University students #Mohali, police officials are trying to pacify protesting students and bring down the situation to normal as students allege police inaction and their reluctancy to lodge FIR. pic.twitter.com/OiZJwjslhM

చండీగఢ్ యూనివర్శిటీ క్యాంపస్‌‌లోని హాస్టళ్లల్లో ఉంటూ చదువుకుంటోన్న విద్యార్థినులు స్నానం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం 60 మంది విద్యార్థులను స్నానం చేస్తోన్న దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే యూనివర్శిటీ విద్యార్థిని ఒకరు దీన్ని తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించినట్లు నిర్ధారించారు. ఆ వీడియోలన్నింటినీ ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో నివసిస్తోన్న తన స్నేహితుడికి పంపించింది. అతను వాటిని ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశాడు.

Protest breaks out in #Chandigarh University, MMS of various girls living in Hostel of Chandigarh University got viral.

Apparently, Videos were recorded by a #Girl from the same hostel & were forwarded to her Boyfriend.

4 Girls have committed Suicide🫣 pic.twitter.com/eAkHwNVZMm

ఆ వెంటనే అవి వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలియడంతో యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రంతా క్యాంపస్‌లో బైఠాయించారు. విద్యార్థినులు స్నానం చేస్తోన్న దృశ్యాలను చిత్రీకరించిన విద్యార్థిని కూడా ఇందులో పాల్గొన్నారు. తోటి విద్యార్థులు, హాస్టల్ అధికారులు, పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించారు. తానే వాటిని షూట్ చేశానని, సిమ్లాలోని తన స్నేహితుడికి పంపించానని చెప్పారు.

Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : PunYaab

pic.twitter.com/BIi1jTBPCN

ఈ ఘటన తరువాత నిందితురాలితో పాటు వీడియోలో కనిపించిన కొందరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ- పోలీసులు తోసిపుచ్చారు. మెడికల్ రికార్డుల ప్రకారం.. ఎవరూ సూసైడ్‌ చేసుకోలేదని అన్నారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వచ్చిన వార్తలను పబ్లిసిటీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యకు యత్నించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదని, డాక్టర్ల నుంచి నివేదిక అందిన తరువాతే స్పష్టత వస్తుందని మొహాలీ ఎస్ఎస్పీ తెలిపారు.

ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్పందించారు. బాత్‌రూమ్ వీడియోలను షూట్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ఉదంతాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తోన్నామని, దర్యాప్తు ముమ్మరం చేశామని వివరించారు. కేంద్రమంత్రి సోమ్ ప్రకాష్ సైతం ఈ విషయంపై ఆరా తీశారు. దీన్ని దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.