బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ – కలిసే పోరాటం: సీతారాం ఏచూరి..!!

బీజేపీని నిలువరించేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలతో పాటుగా తెలంగాణలో పరిస్థితుల పైన ఆయన స్పందించారు. బీజేపీ చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ స్టేట్ లో రాజకీయ ఖైదీ లు గా 4482 మంది కమ్యునిస్ట్ లు జైల్లో ఉన్నారని ఏచూరీ గుర్తు చేసారు. కాశ్మీర్ రాజు నాడు భారత్ లో కలవమని చెప్పారని..బీజేపీ ప్రభుత్వం అటువంటి వ్యక్తి పుట్టిన రోజును సెలవు దినంగా ప్రకటించిందని ఆక్షేపించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీకి భాగ్వామ్యం లేదన్నారు. నాడు.. నిజాం సరెండర్ అయ్యాకా..కమ్యునిస్ట్ పాలన వస్తుంది అని భూస్వాములకు అప్పటి ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ విలీనమైన రోజును బీజేపీ నేతలు హిందూ..ముస్లిం గొడవ గా చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అది బీజేపీ రాజకీయమని ఎద్దేవా చేసారు. సాయుధ పోరాటం గురించి అవగాహన లేకుండా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు మతాలకు అతీతంగా పోరాటం జరిగిందని గుర్తు చేసారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసారని ఏచూరి చెప్పుకొచ్చారు. ఇదే బీజేపీ నేతలు ఇప్పుడు వల్లభాయ్ పటేల్ నీ వాళ్ళ నాయకుడిగా చెప్పుకుంటున్నారన్నారు. ఇప్పుడు దేశంలో ఒకటవుతునన లౌకిక ప్రత్యామ్నాయ శక్తుల లో కాంగ్రెస్ కూడా ఉంటుందని చెప్పారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ – లెఫ్ట్ పార్టీల మధ్య గ్యాప్ ఉందని ఏచూరి విశ్లేషించారు. బెంగాల్ లో తృణమూల్ అన్ పాపులర్ అయ్యిందని ఏచూరి విమర్శించారు.