పోలీసుల కస్టడీలో 22 ఏళ్ల యువతి మృతి: హిజాబ్ తొలగించి మహిళల భారీ ఆందోళన

టెహ్రాన్: ఇరాన్‌లో 22 ఏళ్ల కుర్దిష్ మహిళ మహ్సా అమినీ మరణించిన తర్వాత భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. హిజాబ్ నిబంధనలు పాటించలేదనే నెపంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మూడు రోజుల తర్వాత అమిని శుక్రవారం ఆస్పత్రిలో మరణించినట్లు నివేదికలు తెలిపాయి.

Women of Iran-Saghez removed their headscarves in protest against the murder of Mahsa Amini 22 Yr old woman by hijab police and chanting:

death to dictator!

Removing hijab is a punishable crime in Iran. We call on women and men around the world to show solidarity. #مهسا_امینی pic.twitter.com/ActEYqOr1Q

అమిని చికిత్స పొందుతున్న ఆస్పత్రి వెలుపల నిరసనకారులు మొదట గుమిగూడారు. హిజాబ్ తొలగించిన మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా దళాలు నిరసనకారులపై పెప్పర్ స్ప్రే చేశారు. అంతేగాక, వారిలో చాలా మందిని అరెస్టు చేసినట్లు గార్డియన్ నివేదించింది.

శనివారం అంత్యక్రియల కోసం అమిని మృతదేహాన్ని ఆమె స్వస్థలమైన కుర్దిస్థాన్ ప్రావిన్స్‌కు తరలించారు.

వందలాది మంది అమిని స్వగ్రామంలో అంత్యక్రియల కోసం గుమిగూడారు. “నియంతకు చావు” తప్పదు అంటూ కొందరు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

Members of the public have started gathering in protest outside the hospital where Mahsa Amini sadly passed away after being detained by morality police.

The video shows the main entrance to Tehran’s Kasra Hospital this afternoon (35.739372,51.4147088)
pic.twitter.com/aDISClRNoN

నిరసనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

దేశంలోని హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు టెహ్రాన్ సందర్శించిన సమయంలో బాధిత యువతిని పోలీసులు అరెస్టు చేశారు. డిటెన్షన్ వ్యాన్‌లో ఆమెను కొట్టినట్లు సమాచారం. అయితే అమినీకి గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.కాగా, ఇరాన్ తోపాటు పలు దేశాలు కూడా ఆ యువతికి మద్దతుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.