డైరీ, డాక్యుమెంట్స్ స్వాధీనం, బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన, ముగ్గురి అరెస్ట్

ఉగ్ర దాడులు, ఉగ్ర మూలాలకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేస్తు ఉంటుంది. ఇవాళ ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో అలజడి నెలకొంది. ఏకకాలంలో 23 చోట్ల సోదాలు నిర్వహించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సానుభూతిపరుల నివాసాలు, షాపులు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడినుంచి రికార్డులు, ఇతర సమాచారం తీసుకెళ్లారు.

సామాజిక సేవ ముసుగులో శిక్షణ ఇస్తున్నారని సమాచారం ఉంది. యువతను ఉగ్రవాద కార్యక్రమాలవైపు మళ్లిస్తున్నారనే అభియోగాలతో పీఎఫ్ఐ నేతల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, భైంసా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం, కర్నూలు, కడప, గుంటూరులో సోదాలు నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్ ఫారంలో షేక్ ముఖిద్ ఇంటిని జల్లెడ పట్టారు. అతని బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై వివరాలు సేకరించారు. పాస్ పోర్టు సీజ్ చేసి, బ్యాంక్ పాస్ బుక్ తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్‌లో నాలుగు ఇళ్లతోపాటు, ఓ మెడికల్ షాపులో సోదాలు చేశారు. ఇందులో ఒకరి ఇంట్లో డైరీ, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి కరీంనగర్ హుస్సేనిపురాలో బంధువుల ఇంట్లో ఉన్నారు. అతడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

NIA conducts raids in Andhra Pradesh’s Nellore, Nandyal and Telangana’s Jagtial, in connection with the PFI case. The agency is searching the residence of one Shadulla who is the main accused in this case. https://t.co/ksxWEnaeeN pic.twitter.com/53b6BcQxbo

నిర్మల్ జిల్లా భైంసాలో మదీనా కాలనీలో సోదాలు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. భైంసాలో తరచూ అల్లర్లు జరుగుతుండడంతో ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. వీరికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉందని గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో తనిఖీలు చేపట్టారు. ఓ అనుమానితుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.