Latest Posts

Rasi Phalalu (16th Sep 2022) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

ఈ రోజు ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Latest Posts

Don't Miss